iDreamPost

మా సంబంధం గురించి ఈ దేశానికి అనవసరం.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ స్టార్ క్రికెటర్ తో తనకు ఉన్న సంబంధం గురించి ఈ దేశానికి అనవసరం అంటూ సంచలన కామెంట్స్ చేశాడు కేకేఆర్ మెంటర్, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అతడు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఆ వివరాలు..

ఆ స్టార్ క్రికెటర్ తో తనకు ఉన్న సంబంధం గురించి ఈ దేశానికి అనవసరం అంటూ సంచలన కామెంట్స్ చేశాడు కేకేఆర్ మెంటర్, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అతడు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఆ వివరాలు..

మా సంబంధం గురించి ఈ దేశానికి అనవసరం.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

గౌతమ్ గంభీర్.. తన మార్క్ మెంటరింగ్ తో కేకేఆర్ కు ముచ్చటగా మూడో ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. గతంలో ధోని, విరాట్ కోహ్లీలపై టైమ్ దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించేవాడు గంభీర్. కానీ ఈ మధ్యకాలంలో అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. విమర్శించిన నోటితోనే వారిని ఇప్పుడు పొగుడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తమపై తప్పుడు వార్తలు రాసి.. ప్రజలకు మసాలా అందించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు గంభీర్. విరాట్ కోహ్లీకి తనకు ఉన్న సంబంధం గురించి ఈ దేశానికి తెలియాల్సిన అవసరం ఏ మాత్రం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. మరి గంభీర్ ఎందుకు ఇలా అన్నాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ లో ఓ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ గ్రౌండ్ లోనే గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరోసారి గంభీర్ లక్నో మెంటర్ గా ఉన్నప్పుడు నవీన్ ఉల్ హక్ విషయంలో విరాట్ తో వాగ్వాదానికి దిగాడు గంభీర్. ఈ సంఘటనలు ఇద్దరిని శత్రువులుగా మార్చింది అని చాలా మంది అనుకున్నారు. అప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. విరాట్ కోహ్లీకి తనకు ఎలాంటి విభేదాలు లేవని గంభీర్ స్పష్టం చేశాడు. మరోవైపు కోహ్లీ సైతం ఇలాగే స్పందించాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్ కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. కోహ్లీతో ఉన్న సత్ససంబంధం గురించి ప్రశ్నలు అడగ్గా.. గంభీర్ సమాధానం ఇస్తూ..”విరాట్ కోహ్లీ ఎలాగైతే తన టీమ్ ను గెలిపించడానికి ఎలాంటి భావాలు వ్యక్తీకరిస్తాడో.. నేను నా జట్టును గెలిపించడానికి అలాగే చేస్తుంటాను. ఇక మా మధ్య ఉన్న సంబంధం గురించి ఈ దేశానికి అనవసరం. మా మధ్య రిలేషన్ షిప్ ప్రజలకు మసాలా అందించడానికి కాదు”అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ”నవీన్ ఉల్ హక్ ను, గౌతమ్ గంభీర్ ను నేను హగ్ చేసుకోవడం నా ఫ్యాన్స్ కు నచ్చలేదు. దాంతో వారు నిరాశకు గురైయ్యారు. అయితే గొడవలను ఇలాగో కొనసాగించేందుకు మేమేం చిన్నపిల్లలం కాదు” అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి తమ అనుబంధం గురించి ఈ దేశానికి అవసరం లేదన్న గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి