T20 Womens World Cup: ICC కీలక నిర్ణయం.. టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ వేదిక మార్పు! బంగ్లా నుంచి దుబాయ్ కి

అక్టోబర్ 3 నుంచి జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి వరల్డ్ కప్ తరలిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

అక్టోబర్ 3 నుంచి జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి వరల్డ్ కప్ తరలిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

అక్టోబర్ 3 నుంచి జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ బాగుంటే ఈ వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో అధికార మార్పిడి కారణంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో అక్కడ ఈ మెగాటోర్నీని నిర్వహించే పరిస్థితి కనిపించకపోవడంతో.. బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ వేదికను యూఏఈకి తరలించారు. మంగళవారం వర్చువల్ గా సమావేశం అయిన ఐసీసీ బోర్డ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ నుంచి తరలిపోయింది. ఆ దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో అడుగుపెట్టడానికి కొన్ని దేశాలు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఐసీసీ వేదికను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మార్చాల్సి వచ్చింది. ఇక వేదిక మార్పునకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సైతం అంగీకరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ విషయంపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జెఫ్ అలార్డిస్ మాట్లాడుతూ..

“బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా.. అక్కడికి రావడానికి కొన్ని దేశాలు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీని యూఏఈకి తరలించా. అయితే బంగ్లాదేశ్ లో టీ20 వరల్డ్ కప్ జరగకపోవడం నిరాశను కలిగిస్తోంది. బంగ్లా ఎంతో గొప్పగా ఈ మెగా ఈవెంట్ ను నిర్వాహించాలనుకుంది. అయితే బంగ్లాకు ఆతిథ్య హక్కులు కొనసాగుతాయి. మరేదైనా ఐసీసీ టోర్నీనికి అక్కడ నిర్వహించడానికి ప్రయత్నిస్తాం” అంటూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జెఫ్ అలార్డిస్ చెప్పుకొచ్చాడు. కాగా.. వచ్చే నెలలో పురుషుల టీమ్ కూడా టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ కు వెళ్లాల్సి ఉంది. పరిస్థితులు ఇలాగే ఉంటే.. భారత జట్టు కూడా బంగ్లాకు వెల్లడం సందేహమే.

Show comments