వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలను క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ సంస్థలు తమ ప్లాన్స్ తో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు వరల్డ్ కప్ ను తమ బిజినెస్ కు అనుకూలంగా మార్చుకుని ఆఫర్లు ప్రకటిస్తూ.. లాభాల పంట పండిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ వరల్డ్ కప్ ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ అయిన స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్ ప్రైజ్ ను ఆఫర్ చేయనుంది. ఇక వరల్డ్ కప్ 2023 సందర్భంగా తమ కష్టమర్లలో జోష్ నింపేందుకు పలు రకాలైన ఆఫర్లను ప్రకటించింది. మరి ఆ ఆఫర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన స్విగ్గీ.. తన కష్టమర్లలో జోష్ నింపేందుకు 2023 వరల్డ్ కప్ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ. 150 తగ్గించ నున్నట్లు కంపెనీ తెలిపింది. అదీకాక మ్యాచ్ డే మానియా ఆఫర్ కింద ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్ లో రన్స్ జమ అవుతాయి. ఇలా జమా అయిన రన్స్ తో వారు షాపింగ్ తో పాటు పలు విలువైన బహుమతులు కొనుగోలు చేసుకోవచ్చు.
ఇక 2 రన్స్ కు స్విగ్గీ లేదా ఇన్స్ స్టామార్ట్ లో నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు. అలాగే 4 పరుగులకు డైనింగ్ లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్ కట్టే వెసులుబాటు ఉంది. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్ది.. తాజ్ హోటల్లో బస, తనిష్క్ వోచర్ లు గెలుచుకోవచ్చు. ఇంకో ఆద్భుతమైన ఆఫర్ ఏంటంటే? 24 పరుగులు సాధిస్తే ఐఫోన్ 15, 36 పరుగులు సాధిస్తే స్కోడా కారును గెలుపొందో అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. మరి స్విగ్గీ ప్రకటించిన ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.