iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: KKR కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్? అయ్యర్ పై వేటు ఖాయమా?

  • Published Aug 25, 2024 | 11:18 AM Updated Updated Aug 25, 2024 | 11:18 AM

వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆ ఫ్రాంచైజీని వీడి.. కేకేఆర్ లోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ సూర్యకు కెప్టెన్సీతో పాటుగా భారీగా డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆ ఫ్రాంచైజీని వీడి.. కేకేఆర్ లోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ సూర్యకు కెప్టెన్సీతో పాటుగా భారీగా డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Suryakumar Yadav: KKR కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్? అయ్యర్ పై వేటు ఖాయమా?

ఐపీఎల్ 2025 ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అందరి దృష్టిని ఈ మెగాటోర్నీ ఆకర్షిస్తోంది. ఏ ప్లేయర్లు ఆక్షన్ లోకి వస్తారు? ఎవరిని రిటైన్ చేసుకుంటారో అన్న విషయాలపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్లపై ఇతర ఫ్రాంచైజీలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్ గా చేసిన దగ్గర నుంచి ఆ టీమ్ లో విభేదాలు ప్రారంభం అయ్యాయి. పాండ్యా కెప్టెన్సీని పలువురు ఆటగాళ్లు స్వీకరించడంలేదు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ సైతం ముంబైని వీడనున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. సూర్యకు కేకేఆర్ కెప్టెన్సీ ఆఫర్ తో పాటుగా భారీగా డబ్బులు ఇస్తానని తెలిపినట్లు సమాచారం.

టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ పై కోల్ కత్తా నైట్ రైడర్స్ కన్నేసినట్లు సమాచారం. ముంబై కెప్టెన్ గా పాండ్యాను నియమించడంతో సూర్య అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని కేకేఆర్ మేనేజ్ మెంట్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేకేఆర్ యాజమాన్యం సూర్యకు కెప్టెన్సీ ఆఫర్ తో పాటుగా ఎంత డబ్బు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్. ఇదే జరిగితే ప్రస్తుతం కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Suryakumar Yadav as KKR captain

అయితే కోల్ కత్తాకు  IPL 2024 టైటిల్ అందించిన అయ్యర్ ను తొలగించడం కాస్త సందేహమే అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ వ్యవహరిస్తుండటం, టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ కావడంతో.. కేకేఆర్ మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదీకాక సూర్యకు ముంబై పగ్గాలు ఇవ్వకపోతే.. మెగావేలంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సూర్యతో పాటుగా జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ కూడా ముంబైని వీడుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి సూర్యకుమార్ కేకేఆర్ లోకి వెళ్తాడా? వెళ్లడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.