iDreamPost
android-app
ios-app

సురేశ్ రైనా సునామి ఇన్నింగ్స్! ఈ వయసులో కూడా ఇదేమి కొట్టుడు స్వామి?

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్ లు ఐపీఎల్ ని తలపించే స్థాయిలో జరుగుతున్నాయి. ఈ లీగ్ సెకండ్ సెమీస్ లో సురేశ్ రైనా సునామి ఇన్నింగ్స్ ఆడి యూపీని ఫైనల్ కి చేర్చాడు.

ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్ లు ఐపీఎల్ ని తలపించే స్థాయిలో జరుగుతున్నాయి. ఈ లీగ్ సెకండ్ సెమీస్ లో సురేశ్ రైనా సునామి ఇన్నింగ్స్ ఆడి యూపీని ఫైనల్ కి చేర్చాడు.

సురేశ్ రైనా సునామి ఇన్నింగ్స్! ఈ వయసులో కూడా ఇదేమి కొట్టుడు స్వామి?

సురేశ్ రైనా.. ఇండియన్ క్రికెట్ లో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న ప్రత్యేకమైన ఆటగాడు. తన అవసరాల కన్నా.. టీమ్  అవసరాల  కోసం ఎప్పుడూ ప్రధాన్యం ఇచ్చిన స్టార్ ప్లేయర్. ఫినిషర్ రైనా టీమిండియాకి అందించిన విజయాలు ఎవ్వరూ మరచిపోలేరు. ఇక టీ20 క్రికెట్ లో రైనా విధ్వంసం ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలుసు.  ముఖ్యంగా ఐపీఎల్ లో అయితే రైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే వాడు. అయితే.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి వైదొలిగి సంవత్సరాలు అవుతున్నా ఈ మిస్టర్  ఐపీఎల్ ఆటలో మాత్రం వాడి వేడి ఏ మాత్రం  తగ్గలేదు. ఈ విషయాన్ని ఋజువు చేస్తూ.. రైనా తాజాగా ఓ విధ్వంసకర ఆట తీరుతో రెచ్చిపోయాడు. ఇందుకు ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ లోని సెకండ్ సెమీస్ మ్యాచ్ వేదిక అయ్యింది. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ లో రైనా ఊచకోత కారణంగా  ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ ఫైనల్ కి చేరుకుంది.

ఈ సంవత్సరం ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిసన్ మొదలైన విషయం తెలిసిందే. తొలి నుండి ఈ లీగ్ లో రెచ్చిపోయి ఆడుతున్న సురేశ్ రైనా.. సెకండ్ సెమీస్ లో తన జట్టుకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. నిజానికి యూపీ బ్యాటర్స్ లో రైనా కన్నా ముందు పవన్‌ నేగి అద్భుతమైన ఆటతో జట్టు భారీ స్కోర్ సాధించడానికి కారణం అయ్యాడు.

50 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో నేగి 94 పరుగులు చేసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. అయితే.. ఇతనికి మిగతా బ్యాటర్స్ నుండి అంతగా సహకారం  అందలేదు. ఇలాంటి సమయంలో రైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో రైనా ఏకంగా 58 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే  ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ జట్టు 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. రైనా గ్రౌండ్ నలువైపులా చూడముచ్చని షాట్స్ తో బౌండరీస్ కురిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.  ఒక్కో షాట్ ఒకప్పటి మిస్టర్ ఐపీఎల్ ని గుర్తు చేశాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇక భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 184 పరుగులకే సరి పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్ ఓపెనర్లు జటిన్‌ సక్సేనా(76), నమాన్‌ ఓజా(43) మంచి స్కోర్స్ సాధించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినంత వేగంగా పరుగులు సాధించలేకపోయారు. ఇక్కడ కూడా కెప్టెన్ గా రైనా ఫీల్ సెట్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. దీంతో యూపీ సగర్వంగా ఫైనల్లో అడుగు పెట్టినట్టు అయ్యింది. ఇక యూపీ-ముంబై జట్ల మధ్య ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి.. లీగ్ దశలో అద్భుతాలు సృష్టించిన ముంబైపై సురేష్ రైనా సారధ్యంలోని యూపీ జట్టు ఫైనల్ లో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.