Somesekhar
ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, లక్నో టీమ్స్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవక పోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై మాజీ ప్లేయర్ సురేశ్ రైనా. ఆ కారణం ఏంటంటే?
ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, లక్నో టీమ్స్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవక పోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై మాజీ ప్లేయర్ సురేశ్ రైనా. ఆ కారణం ఏంటంటే?
Somesekhar
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్లు ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, లక్నో. ఇక ఐపీఎల్ హిస్టరీలో ఐదేసి సార్లు కప్ కొట్టిన టీమ్స్ గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించాయి. పై నాలుగు జట్లలో స్టార్ క్రికెటర్ల ఉన్నాగానీ ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలన్న కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో ఆ 4 టీమ్స్ ఎందుకు టైటిల్ కొట్టలేకపోయాయో చెప్తూ టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. లేట్ నైట్ పార్టీస్ వల్లే పై టీమ్స్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, లక్నో టీమ్స్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవక పోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రైనా మాట్లాడుతూ..”ఐపీఎల్ లో కొన్ని జట్లు ఎక్కువగా లేట్ నైట్ పార్టీలు ఇస్తూ ఉంటాయి. ఈ సంప్రదాయం మంచిది కాదు. ఎందుకంటే? లేట్ నైట్ పార్టీల వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఆ పార్టీల వల్ల ఆటగాళ్లు రాత్రి ఆలస్యంగా నిద్రపోతారు. నెక్ట్స్ డే ఆడమంటే ఎలా ఆడతారు? మే, జూన్ లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లకు చురుగ్గా ఉండాలంటే.. రాత్రి తగినంత విశ్రాంతి అవసరం. ఇలాంటి టైమ్ లో లేట్ నైట్ పార్టీలు చేసుకుంటే ఎలా? అందుకే ఆ జట్లు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయాయి” అంటూ తనదైన శైలిలో స్పందించాడు రైనా.
అయితే ప్రస్తుతం రైనా చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో వివాదాస్పదంగా మారాయి. లేట్ నైట్ పార్టీలు అన్నది క్రికెట్ లో సర్వసాధారణమైన విషయం. కానీ మ్యాచ్ లు ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం టీమ్ కు పెద్ద సమస్యగా మారుతుంది. అది కాస్త టైటిల్ గెలవడంపై చూపిస్తోంది. ముంబై, చెన్నై టీమ్స్ ఇలాంటి లేట్ నైట్ పార్టీలను ఇవ్వవని చెప్పుకొచ్చాడు రైనా. అందుకే ఆ జట్లు టైటిళ్లను సాధించడంలో ముందున్నాయని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. డుప్లెసిస్ మయాంక్ దగర్ పై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాడు. ఓ జూనియర్ ప్లేయర్ పై ఇలాంటి కామెంట్స్ తగవు అంటూ డుప్లెసిస్ కు కౌంటర్ ఇచ్చాడు. మరి లేట్ నైట్ పార్టీల వల్లే నాలుగు జట్లు ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న రైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Suresh Raina pic.twitter.com/SgaZbi0jJ1
— RVCJ Media (@RVCJ_FB) April 22, 2024