Somesekhar
వరుసగా రెండు విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్ లో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు అనుకోని షాక్ తగిలింది. దీంతో కన్ఫ్యూజన్ లో పడింది SRH యాజమాన్యం. ఇంతకీ ఆ షాక్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
వరుసగా రెండు విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్ లో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు అనుకోని షాక్ తగిలింది. దీంతో కన్ఫ్యూజన్ లో పడింది SRH యాజమాన్యం. ఇంతకీ ఆ షాక్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ నిలకడగా రాణిస్తోంది. చివరి రెండు మ్యాచ్ లో అద్భుతమై విజయాలను నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న హైదరాబాద్ టీమ్.. బౌలింగ్ లో కూడా సత్తాచాటుతోంది. అయితే తాజాగా ఓ క్రికెట్ బోర్డ్ ఇచ్చిన షాక్ తో అయోమయంలో పడింది SRH టీమ్. ఈ ఊహించని పరిణామంతో నెక్ట్స్ స్టెప్ ఎటు వేయాలో తేల్చుకోలేకపోతోంది. అసలు హైదరాబాద్ యాజమాన్యం అయోమయంలో పడటానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చివరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసి ఫుల్ జోష్ లో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. అయితే ఈ జట్టుకు ముందు నుంచి ఓ సమస్య ఎదురౌతూ వస్తోంది. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా జట్టులోకి వస్తాడని అందరూ ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా బీసీసీఐతో పాటుగా సన్ రైజర్స్ యాజమాన్యానికి ఊహించని షాకిచ్చింది శ్రీలంక బోర్డు. హసరంగ ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడటం కుదరదని బీసీసీఐకి శ్రీలంక క్రికెట్ బోర్డు చెప్పినట్లు సమాచారం. మడమ గాయం కారణంగా అతడు సన్ రైజర్స్ జట్టులోకి కాస్త ఆలస్యంగా వస్తాడని ముందుని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం అతడు ఈ సీజన్ మెుత్తానికే దూరం కానున్నట్లు తెలుస్తోంది.
జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదీకాక ఇటీవలే చికిత్సకు దుబాయ్ వెళ్లొచ్చాడు హసరంగ. అక్కడి వైద్యులు సైతం అతడికి విశ్రాంతిని సూచించారట. ఇదిలా ఉండగా.. హసరంగ ఐపీఎల్ కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నిషేధం నుంచి తప్పించుకోవడానికే హసరంగను బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపిక చేశారన్న వాదనలకు ఇది బలాన్ని చేకూరుస్తోంది. తాజాగా ఈ విషయం బయటపడటంతో సన్ రైజర్స్ యాజమాన్యం అయోమయంలో పడింది. సీజన్ సగం గడిచిన తర్వాతనైనా హసరంగ టీమ్ లోకి వస్తే.. స్లో పిచ్ లపై అతడు ప్రభావం చూపగలడని భావించింది హైదరాబాద్ యాజమాన్యం. కానీ ఊహించని షాక్ తగలడంతో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు SRHకి. ప్రత్యామ్నాయంగా ఇతర ప్లేయర్ కోసం వెతకాలా? వద్దా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Wanindu Hasaranga has been ruled out of #IPL2024 ❌ pic.twitter.com/K4F1vl07qq
— ESPNcricinfo (@ESPNcricinfo) April 6, 2024