iDreamPost

IPL 2024: తీసుకునే డబ్బుకు న్యాయం చేయండి.. RCB ప్లేయర్లపై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు!

తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలని ఆర్సీబీ ప్లేయర్లను ఘాటుగా విమర్శించాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ సీజన్ లో దారుణ ఓటముల నేపథ్యంలో వీరూ భాయ్ ఈ కామెంట్స్ చేశాడు.

తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలని ఆర్సీబీ ప్లేయర్లను ఘాటుగా విమర్శించాడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ సీజన్ లో దారుణ ఓటముల నేపథ్యంలో వీరూ భాయ్ ఈ కామెంట్స్ చేశాడు.

IPL 2024: తీసుకునే డబ్బుకు న్యాయం చేయండి.. RCB ప్లేయర్లపై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు!

ఐపీఎల్ సీజన్లు మారుతున్నాయి గానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మాత్రం మారడం లేదు. ఎన్ని సీజన్లు మారినా.. జట్టు ఆటతీరులో మార్పులేదు. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటాలు చేయడం, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం కావడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇక ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 5 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో ప్లేస్ లో నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోవడంతో.. ఆ టీమ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఈ సీజన్ లో ఆర్సీబీకి మరో పరాజయం ఎదురైంది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా.. టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. బట్లర్ శతకం ముందు విరాట్ సెంచరీ బూడిదలో పోసిన పన్నీరులాగా అయ్యింది. ఆర్సీబీ పరాజయంపై తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. తనదైన శైలిలో విదేశీ బ్యాటర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కోట్లకు కోట్లు తీసుకుంటున్నారు కనీసం ఆ డబ్బులకైనా న్యాయం చేయండి అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.

Sehwag

ఆర్సీబీ వైఫ్యలంపై వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే అతడికి గ్లెన్ మాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్ల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. పైగా దినేష్ కార్తిక్ బ్యాటింగ్ కు రాలేదు. మహిపాల్ లూమోర్ టీమ్ లో లేడు. దీంతో ఆర్సీబీ చివర్లో తడబడింది. కానీ మాక్స్ వెల్, గ్రీన్ లాంటి ప్లేయర్లు తాము తీసుకుంటున్న డబ్బులకు న్యాయం చేయాలి. వారి సత్తా చూపెట్టాలి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఇంకో 20 రన్స్ చేయాల్సింది. కోహ్లీ సైతం స్ట్రైక్ రేట్ పెంచుకోవచ్చు.. అయితే ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో.. అతడు కాస్త ఒత్తిడికి లోనై స్లోగా బ్యాటింగ్ చేశాడు” అని వీరూ భాయ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ స్లో ఇన్నింగ్స్ పై సెల్ఫిష్ అంటూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మరి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలన్న సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి