iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ ను తప్పించి.. పాండ్యాను కెప్టెన్ చేయడం కరెక్టే: దిగ్గజ క్రికెటర్

  • Published Dec 18, 2023 | 6:23 PM Updated Updated Dec 18, 2023 | 6:23 PM

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. రోహిత్ ను తప్పించి పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం కరెక్టే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. రోహిత్ ను తప్పించి పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం కరెక్టే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: రోహిత్ ను తప్పించి.. పాండ్యాను కెప్టెన్ చేయడం కరెక్టే: దిగ్గజ క్రికెటర్

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా క్రీడా ప్రపంచంలో ప్రస్తుతం ఈ రెండు పేర్లు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పరోక్షంగా ఓ యుద్ధమే జరుగుతోంది. ఐపీఎల్ 2024 ప్రారంభం కాకముందే.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15న ముంబై ఫ్రాంచైజీ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. హిట్ మ్యాన్ ను కావాలనే తప్పించారని వారు ముంబై యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. రోహిత్ ను తప్పించి పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం కరెక్టే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాను నియమించడం సరైందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఈ విషయంలో పాండ్యాకు మద్ధతుగా నిలిచాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ..”హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్ గా నియమించడం ఆ జట్టుకు ప్రయోజనకరమే. ఇక కొన్నిసార్లు ఫ్రాంచైజీలకు కొత్తకొత్త థాట్స్ అవసరమే. మీరు గమనిస్తే.. రోహిత్ శర్మ గత రెండేళ్లుగా ఐపీఎల్ లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. ముంబై గతేడాది ప్లే ఆఫ్ కు చేరినా.. 2022లో దారుణంగా విఫలమైంది. గత కొన్ని సంవత్సరాలుగా అతడిలో జోరు కనిపించడంలేదు. అతడిలో సత్తా తగ్గింది. విరామం లేకుండా క్రికెట్ ఆడటంతో.. అతడు అలసిపోయి ఉంటాడు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ క్రికెటర్.

ఇక హార్దిక్ గుజరాత్ ను ఆడిన తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిపాడని, ఆ తర్వాత గత ఏడాది ఫైనల్ వరకూ చేర్చాడని సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు. వీటిని పరిగణంలోకి తీసుకుంటే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. పాండ్యాకు అప్పగించడం కరెక్టే నని గవాస్కర్ పేర్కొన్నాడు. రోహిత్ ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్, దిగ్గజం డివిలియర్స్ కూడా సమర్థించాడు. మరి సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.