iDreamPost
android-app
ios-app

ధోని ఇచ్చిన గిఫ్ట్ ను ఇంట్లో భద్రంగా దాచుకున్నాను.. గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్!

  • Published Mar 07, 2024 | 8:54 PM Updated Updated Mar 07, 2024 | 8:54 PM

ధోని తనకు ఇచ్చిన విలువైన గిఫ్ట్ గురించి చెప్పుకొచ్చాడు దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్. మరి ఇంతకీ మిస్టర్ కూల్ గవాస్కర్ కు ఇచ్చిన ఆ బహుమతి ఏంటి? దాన్ని భద్రంగా ఇంట్లో దాచడానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళితే..

ధోని తనకు ఇచ్చిన విలువైన గిఫ్ట్ గురించి చెప్పుకొచ్చాడు దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్. మరి ఇంతకీ మిస్టర్ కూల్ గవాస్కర్ కు ఇచ్చిన ఆ బహుమతి ఏంటి? దాన్ని భద్రంగా ఇంట్లో దాచడానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళితే..

ధోని ఇచ్చిన గిఫ్ట్ ను ఇంట్లో భద్రంగా దాచుకున్నాను.. గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్!

మహేంద్రసింగ్ ధోని.. తన ఆటతీరుతో, వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ధోని అభిమానుల్లో సాధారణ వ్యక్తులతో పాటుగా సెలబ్రిటీలు కూడా ఉన్న విషయం మనందరికి తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ధోనికి తాము వీరాభిమానులను చెప్పారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధోని తనకు ఇచ్చిన విలువైన గిఫ్ట్ గురించి చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ ప్లేయర్. మరి ఇంతకీ మిస్టర్ కూల్ ఇచ్చిన ఆ బహుమతి ఏంటి? మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాను భద్రంగా ఇంట్లో దాచుకున్న ఓ విలువైన ఆస్తి గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ..”నేను ఎప్పుడైతే ధోని ఆట చూశానో.. అప్పటి నుంచి అతడికి ఫ్యాన్ గా మారిపోయాను. ఒక ఫ్యాన్ కు ఏం కావాలి? తన అభిమాన హీరోని కలుసుకోవాలని, అతడి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, మాట్లాడాలని కోరుకుంటాడు. ఓ ఫ్యాన్ గా నేను కూడా ధోని నుంచి ఇదే ఆశించాను. అందుకే ఆ రోజున నా షర్ట్ పై ధోని ఆటోగ్రాఫ్ ను తీసుకున్నాను. అది ఇప్పటికీ ఎంతో భద్రంగా మా ఇంట్లో దాచుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ ఆటగాడు.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 16వ సీజన్ లో చెపాక్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. ఈ ఓటమితో చెన్నై ఇంటికి వెళ్లింది. అయితే ఓడిపోయినప్పటికీ.. నిరాశచెందకుండా.. ఆటగాళ్లందరూ గ్రౌండ్ లో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం తెలిపారు. ఈ టైమ్ లో కామెంటేటర్ గా ఉన్న సునీల్ గవాస్కర్ వచ్చి.. ధోనిని షర్ట్ పై ఆటోగ్రాఫ్ పెట్టమని అడిగాడు. దాంతో అతడు ఆశ్చర్యానికి గురై.. గవాస్కర్ ను గట్టిగా కౌగిలించుకుని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ షర్ట్ ను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నానని తెలిపాడు. మరి సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం ధోని ఇచ్చిన గిఫ్ట్ ను ఇంత భద్రంగా దాచుకున్నానని చెప్పడం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: అశ్విన్-కుల్దీప్ మధ్య ఆసక్తికర సన్నివేశం.. మ్యాచ్ కు ఇదే హైలెట్!