బ్రేకింగ్‌: ఆటకు వీడ్కోలు పలికిన భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు!

Sunil Chhetri, Football: క్రికెట్‌ మాత్రమే ప్రాణంగా బతికే ఇండియాకు మరో కొత్త మజాను పరిచయం చేసిన దిగ్గజ ఆటగాడు.. తాజాగా ఆటకు వీడ్కోలు పలికాడు. దాని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Sunil Chhetri, Football: క్రికెట్‌ మాత్రమే ప్రాణంగా బతికే ఇండియాకు మరో కొత్త మజాను పరిచయం చేసిన దిగ్గజ ఆటగాడు.. తాజాగా ఆటకు వీడ్కోలు పలికాడు. దాని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండియన్‌ క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ ఎలాగే అలాగే ఈ ఆటగాడు కూడా. దేశం గర్వించదగ్గ ప్లేయర్‌. కానీ, సడెన్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇంతకీ ఆటగాడు ఎవరంటే.. ఫేస్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఫుట్‌బాల్‌ సునీల్‌ ఛెత్రి. క్రికెట్‌ను ఒక మతంలా భావించే దేశంలో ఫుట్‌బాల్‌ కూడా ఆదరణ తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన గొప్ప ఫుట్‌బాలర్‌. ప్రపంచం ముందు.. ఇండియన్‌ను కూడా ఫుట్‌బాల్‌లో ఒక ఎదుగుతున్న శక్తిగా నిలబెట్టిన ఘనుడు. ఇప్పుడు వీడ్కోలు పలికి తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించాడు.

జూన్ 6 నుంచి కువైట్‌లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ అని ఛెత్రి ప్రకటించాడు. తన రిటైర్మెంట్‌ గురించి ప్రకటిస్తూ.. సోషల్‌ మీడియాలో ఒక వీడియో రిలీజ్‌ చేశాడు సునీల్‌ ఛెత్రి. 19 ఏళ్లుగా ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చానని, ఇప్పుడు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దేశం కోసం ఆడిన ప్రతి మ్యాచ్‌ తనకు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని అన్నాడు. రిటైర్మెంట్‌పై దాదాపు రెండు నెలల నుంచి ఆలోచిస్తున్నట్లు వెల్లడించాడు. రిటైర్ కావాలనే విషయంపై అంత తేలిగ్గా నిర్ణయాన్ని తీసుకోలేదని, మానసిక సంఘర్షణను అనుభవించినట్లు చెప్పాడు.

తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని సునీల్ పేర్కొన్నాడు. తన నిర్ణయంపై నాన్న సంతోషిస్తే.. అమ్మ, భార్య మాత్రం కాస్త షాక్‌ అయ్యారని తెలిపాడు. టీమిండియా తరఫున ఇప్పటివరకు 145 మ్యాచ్‌లను ఆడిన సునీల్ ఛెత్రీ.. 93 గోల్స్ చేశాడు. 2011, 2015, 2021లో జరిగిన శాఫ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్, 2007, 2009, 2012 నెహ్రూ కప్పుల్లో రాణించాడు. 2008లో ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్‌ను గెలవడంలో సునీల్‌ ఛెత్రి కీలక పాత్ర పోషించాడు. చాలా కాలంగా భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. మరి ఫుట్‌బాల్‌కు ఇండియాలో గుర్తింపు తెచ్చిన సునీల్‌ ఛెత్రి రిటైర్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments