Somesekhar
Shikhar Dhawan: అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్. అయితే తాను ఎందుకు రిటైర్ అవ్వాల్సి వచ్చిందో తాజాగా చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Shikhar Dhawan: అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్. అయితే తాను ఎందుకు రిటైర్ అవ్వాల్సి వచ్చిందో తాజాగా చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా క్రికెట్ లో గబ్బర్ గా పేరుగాంచిన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవలే తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ధావన్ ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ తో పాటుగా సహచర క్రికెటర్లు సైతం షాక్ కు గురైయ్యారు. ఇక అతడి కంటే ముందుగా క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఎందరో టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతుండగా.. గబ్బర్ మాత్రం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక తాను ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. దాంతో ధావన్ ఇంత బాధపడ్డాడా? అని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా లాంటి ప్లేయర్లు శిఖర్ ధావన్ కంటే ముందే క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ఇషాంత్, పుజారా, రహానే లాంటి వారు సైతం ఇంకా తమ కెరీర్లకు వీడ్కోలు పలకలేదు. కానీ.. అనూహ్యంగా ధావన్ అంతర్జాతీయ కెరీర్ తో పాటుగా డొమెస్టిక్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించి, అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే శిఖర్ ఇంత సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని మాత్రం అప్పుడు వెల్లడించలేదు. తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను క్రికెట్ కు గుడ్ బై ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు.
శిఖర్ ధావన్ మాట్లాడుతూ..”నా కెరీర్ చివరి రెండు సంవత్సరాల్లో నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడింది తక్కువే. ఐపీఎల్ మ్యాచ్ లే ఎక్కువ ఆడాను. ఎంతో కెరీర్ ను ఊహించుకుని, ఎక్కువ మ్యాచ్ లు ఆడాలి అనుకున్నాను. కానీ.. నాకు రెస్ట్ కావాలనిపించింది. దాంతో ఎక్కువ మ్యాచ్ లు ఆడలేకపోయాను, ఫామ్ లో కూడా లేను. ఇక టీమిండియాలో చోటు కోసం దేశవాళీ క్రికెట్ లో ఆడాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. అందుకే డొమెస్టిక్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాను. ఇక ఈ మధ్య కాలంలో ఎంతో మానసిక ఒత్తిడిలకు గురైయ్యాను. ప్రస్తుతానికి మాత్రం సంతోషంగా ఉన్నాను. నా కెరీర్ లో సాధించిన దానిపట్ల సంతృప్తిగా ఉన్నాను. కానీ.. ఒకే ఒక్క లోటు మిగిలిపోయింది. ప్రపంచ కప్ గెలిస్తే బాగుండేది” అంటూ రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం వెల్లడించాడు. ఇక గబ్బర్ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 34 టెస్టుల్లో 2315, 167 వన్డేల్లో 6793, 68 టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 17 సెంచరీలు బాదాడు. ఇక 222 ఐపీఎల్ మ్యాచ్ లో 6769 రన్స్ చేయగా.. ఇందులో రెండు శతకాలతో పాటుగా 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ, డొమెస్టిక్ కెరీర్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఐపీఎల్ లో ఆడనున్నాడు. గతేడాది పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్నాడు.