iDreamPost
android-app
ios-app

తన సెలబ్రేషన్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడెలా ఉన్నాడో చూడండి!

  • Published Sep 10, 2024 | 1:19 PM Updated Updated Sep 10, 2024 | 1:34 PM

Viral Video, Football: ఒక సెలబ్రేషన్‌ వీడియోతో సోషల్‌ మీడియాలో స్టార్‌ అయిన ఓ కుర్రాడు చాలా కాలం తర్వాత.. మళ్లీ మరో వీడియోతో దర్శనం ఇచ్చాడు. అతనెవరో ఇప్పుడెలా ఉన్నాడో చూద్దాం. .

Viral Video, Football: ఒక సెలబ్రేషన్‌ వీడియోతో సోషల్‌ మీడియాలో స్టార్‌ అయిన ఓ కుర్రాడు చాలా కాలం తర్వాత.. మళ్లీ మరో వీడియోతో దర్శనం ఇచ్చాడు. అతనెవరో ఇప్పుడెలా ఉన్నాడో చూద్దాం. .

  • Published Sep 10, 2024 | 1:19 PMUpdated Sep 10, 2024 | 1:34 PM
తన సెలబ్రేషన్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడెలా ఉన్నాడో చూడండి!

సోషల్‌ మీడియా.. ఎప్పుడు ఎవర్ని లేపుతుందో, ఎవర్ని ఏడిపిస్తుందో చెప్పలేం. కొంతమందిని ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసేస్తుంది.. మరికొంత మందిని ట్రోలింగ్‌తో తొక్కిపడేస్తుంది. వీడియోలు, ఫొటోలు.. గంటల్లోనే వైరల్‌ అయిపోతాయి.. ప్రపంచంలోని నలుమూలలకు చేరిపోతాయి.. కొన్ని రోజుల పాటు ఆ వీడియోనో, ఫొటోనో ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉంటుంది. నెటిజన్ల మాటల్లో, చాటింగ్‌లో, షేరింగ్‌లో అంతా అదే ఉంటుంది. అలాంటి ఓ వీడియో కొన్నేళ్ల క్రితం సోషల్‌ మీడియాను షేక్‌ చేసి పడేసింది. ఇప్పటికీ ఆ వీడియోను చూసి నవ్వుకునే వాళ్లు ఉన్నారు. మరీ స్పెషల్‌గా స్పోర్ట్స్‌ లవర్స్‌కి ఆ వీడియో బాగా తెలుసు.

గ్రీన్‌ టీ షర్ట్‌ వేసుకున్న ఓ కుర్రాడు.. మ్యాచ్‌ చూస్తూ.. షాకింగ్‌ ఫేస్‌ పెట్టి.. సడెన్‌గా సెలబ్రేషన్స్‌తో ఊగిపోతూ.. టీ షర్ట్‌ను పైకెత్తి.. నడుము గిరా గిరా తిప్పుతూ.. చేసుకున్న సెలబ్రేషన్‌ వీడియో 2013లో ఊహించని రేంజ్‌లో వైరల్‌ అయింది. ఆ తర్వాత మీమ్‌ కంటెంట్‌ కూడా మారిపోయింది. ఆ వీడియోలో ఉన్న కుర్రాడు ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు. తాజాగా ఆ కుర్రాడికి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. హేయ్‌.. ఆ గ్రీన్‌ టీషర్ట్‌ కుర్రాడానే అతను? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడుగా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఆ కుర్రాడు.. ఫుట్‌బాల్‌ లవర్‌. మన ఇండియన్స్‌కు క్రికెట్‌ అంటే ఎంత పిచ్చి ఉంటుందో.. కొన్ని దేశాల్లో ఫుల్‌బాల్‌ అంటే పడిచచ్చిపోతుంటారు. నిజానికి.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆదరించే క్రీడ ఫుట్‌బాల్‌. ఆ ఆటకు క్రేజీ ఫ్యాన్స్‌ ఉంటారు. ఈ గ్రీన్‌ టీ షర్ట్‌ కుర్రాడు కూడా ఫుట్‌బాల్‌ అంటే ఊగిపోతాడు. ఆ రోజు తమ దేశపు టీమ్‌ మ్యాచ్‌ చూస్తూ.. గోల్‌ కొట్టగానే అలా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అదే సమయంలో కెమెరా మెన్‌ ఆ కుర్రాడ్ని ఫోకస్‌ చేయడంతో అప్పట్లో ఈ వీడియో వైరల్‌ అయింది. తాజాగా ఆ సెలబ్రేషన్స్‌ను రీక్రియేట్‌ చేస్తూ.. మరో వీడియోను నెట్టింట వదిలాడు. అప్పుడలా ఉన్న చిన్న పిల్లోడు.. ఇప్పుడు పెద్దవాడయ్యాంటూ అంతా వీడియోను లైక్‌ చేస్తున్నారు. మరి కిందున్న వీడియో చూసి.. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 𝗝𝗘𝗢‘𝗦 𝗡°𝟬𝟴 ® (@jeosn08)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss