iDreamPost
android-app
ios-app

రిటైర్మెంట్‌పై ‘U టర్న్‌’.. రోహిత్‌ శర్మ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

  • Published Sep 18, 2024 | 5:40 PM Updated Updated Sep 18, 2024 | 5:40 PM

Rohit Sharma, Retirement: రిటైర్మెంట్‌ ఒక జోక్‌ అంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి రోహిత్‌ అలా ఎందుకన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Rohit Sharma, Retirement: రిటైర్మెంట్‌ ఒక జోక్‌ అంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి రోహిత్‌ అలా ఎందుకన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  • Published Sep 18, 2024 | 5:40 PMUpdated Sep 18, 2024 | 5:40 PM
రిటైర్మెంట్‌పై ‘U టర్న్‌’.. రోహిత్‌ శర్మ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సైతం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాదు. రిటైర్మెంట్‌ ప్రకటనకు టీ20 వరల్డ్‌ కప్‌ విజయం కంటే.. మంచి సందర్భం ఏముంటుందంటూ కోహ్లీ, రోహిత్‌ ఒకే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించారు. టీ20 రిటైర్మెంట్‌ తర్వాత.. రోహిత్‌ శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడాడు. దాదాపు నెలన్నర గ్యాప్‌ తర్వాత.. మళ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు రెడీ అవుతున్నాడు.

బంగ్లాతో తొలి టెస్ట్‌కి ముందు రోహిత్‌ రిటైర్మెంట్‌పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రస్తుతం వరల్డ్‌ క్రికెట్‌లో రిటైర్మెంట్ అనేది ఒక జోక్‌గా మారిపోయింది. కొంతమంది రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఇండియాలో అయితే ఇప్పటి వరకు అలా జరగలేదు. కానీ, వేరే దేశాల్లో మాత్రం ఇలాంటి విషయాలు నేను గమనించాను. కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ యూ-టర్న్ తీసుకుంటున్నారు. దాంతో వాళ్లు నిజంగా రిటైర్ అయ్యారో లేదో తెలియడం లేదు. నా విషయంలో మాత్రం రిటైర్మెంట్‌ నిర్ణయం ఫైనల్‌. నా రిటైర్మెంట్‌పై నేను చాలా క్లియర్‌గా ఉన్నాను’ అని పేర్కొన్నాడు. ఈ స్టేట్‌మెంట్‌తో ఒక రోహిత్‌ శర్మ.. టీ20ల్లో తన రిటైర్మెంట్‌ను వెనక్కితీసుకునే ఉద్దేశం అతనికి లేదని స్పష్టమైపోయింది. గతంలో చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జాతీయ జట్టుకు అవసరం వస్తే.. రిటైర్మెంట్‌ నుంచి బయటికి వస్తున్నామంటూ ప్రకటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు కెవిన్‌ పీటర్సన్‌, మొయిన్‌ అలీ, పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు ఇమ్రాన్‌ ఖాన్‌, జావెద్‌ మియాందాద్‌, షాహీద్‌ అఫ్రిదీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి.. తర్వాత రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇక రోహిత్‌ చెప్పినట్లు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న వారిలో టీమిండియా క్రికెటర్లు లేకుండా పోలేదు. భారత మాజీ బౌలర్‌ జవగల్‌ శ్రీనాథ్‌.. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కోరిక మేరకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని.. 2003 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడాడు. ఇకపోతే.. రోహిత్‌ శర్మ టీ20లకు రిటైర్మెంట్‌ ఇచ్చినా.. వన్డే, టెస్టు క్రికెట్‌లో మాత్రం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2027 వరకు రోహిత్‌ శర్మ వన్డే ఫార్మాట్‌లో ఆడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే.. గురువారం నుంచి టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. రెండు టెస్టుల టెస్ట్ సిరీస్‌ తర్వాత.. మూడు టీ20లు కూడా ఆడనున్నాయి భారత్‌-బంగ్లా జట్లు. మరి రిటైర్మెంట్‌పై రోహిత్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.