iDreamPost
android-app
ios-app

శిఖర్‌ ధావన్‌.. పర్సనల్‌ లైఫ్‌, క్రికెట్‌ లైఫ్‌ గురించి మీకు తెలియని నిజాలు!

  • Published Aug 25, 2024 | 4:10 PM Updated Updated Aug 25, 2024 | 4:10 PM

Stunning Facts About Shikhar Dhawan: భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ధావన్ పర్సనల్ లైఫ్, క్రికెట్ లైఫ్​కు సంబంధించి తెలియని నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Stunning Facts About Shikhar Dhawan: భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ధావన్ పర్సనల్ లైఫ్, క్రికెట్ లైఫ్​కు సంబంధించి తెలియని నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 25, 2024 | 4:10 PMUpdated Aug 25, 2024 | 4:10 PM
శిఖర్‌ ధావన్‌.. పర్సనల్‌ లైఫ్‌, క్రికెట్‌ లైఫ్‌ గురించి మీకు తెలియని నిజాలు!

భారత క్రికెట్​లో ఒక శకం ముగిసింది. అన్ని ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్​గా ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించిన సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. క్రికెట్​కు భారత్ అందించిన మేటి ఓపెనర్లలో ఒకడిగా, బెస్ట్ వన్డే ప్లేయర్ల లిస్టులోనూ ఒకడిగా పేరు తెచ్చుకున్న ధావన్ శనివారం క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. ఈ క్రికెట్ జర్నీలో తనకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్​లు, ఫ్యామిలీ, ఫ్యాన్స్​కు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. దేశానికి సుదీర్ఘ కాలం సేవలు అందించానని, ఇప్పుడు ప్రశాంతంగా నిష్క్రమిస్తున్నానని గబ్బర్ చెప్పాడు. పుష్కర కాలం పాటు భారత్​కు సేవలు అందించిన ధావన్ రిటైర్మెంట్​తో అతడు సాధించిన ఘనతలు, సృష్టించిన రికార్డులను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధావన్ పర్సనల్ లైఫ్, క్రికెట్ లైఫ్​కు సంబంధించి బయటకు తెలియని నిజాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ఆ టోర్నీతో వెలుగులోకి..

చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనే తపనతో ఆడుతూ వచ్చిన ధావన్ అండర్-19 వరల్డ్ కప్​-2004తో వెలుగులోకి వచ్చాడు. ఆ ప్రపంచ కప్​లో హయ్యెస్ట్ స్కోరర్​ (505 రన్స్)గా నిలిచాడు. ఈ రికార్డును ఒక్క రన్ తేడాతో 2022లో సౌతాఫ్రికా ప్లేయర్ డెవాల్డ్ బ్రేవిస్ బ్రేక్ చేశాడు. అలా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వచ్చిన ధావన్ 2010లో ఇంటర్నేషనల్‌ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ సిరీస్​లో రెండు సెంచరీలు బాదడంతో గబ్బర్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ధావన్.. 2013 నుంచి 2019 మధ్య ఏకంగా 17 సెంచరీలు బాదాడు. ఐసీసీ టోర్నీల్లో రెచ్చిపోయి ఆడుతూ మిస్టర్ ఐసీసీ అనే బిరుదును దక్కించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2013లో 5 మ్యాచుల్లో 363 పరుగులతో హయ్యెస్ట్ స్కోరర్​గా నిలిచి భారత్ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

అజాత శత్రువు

ఛాంపియన్స్ ట్రోఫీ-2013తో పాటు వన్డే వరల్డ్ కప్-2015, ఛాంపియన్స్ ట్రోఫీ-2017, ఆసియా కప్-2018 లాంటి బడా టోర్నీల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా ధావన్ నిలిచాడు. రోహిత్ శర్మతో కలసి ఓపెనర్​గా దిగుతూ ఎన్నో మ్యాచుల్లో జట్టుకు సింగిల్ హ్యాండ్​తో విజయాలు అందించాడు. ఈ జోడీ వన్డేల్లో 117 ఇన్నింగ్స్​ల్లో కలిపి 45.15 సగటుతో 5,193 పరుగులు చేశారు. ఇందులో 18 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్​గా, ఫీల్డర్​గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ధావన్.. అందరు ఆటగాళ్లతో కలసిపోయేవాడు. శత్రువుల్లేని ఆటగాడిగా అతడు పేరు తెచ్చుకున్నాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో ఒకేలా మెలగడం గబ్బర్ శైలి. టీమ్​లో ఉన్నా, జట్టు నుంచి తీసేసినా, ఏం చేసినా ఏనాడూ అటు తోటి ప్లేయర్ల మీద గానీ ఇటు బీసీసీఐ మీద గానీ విమర్శలు చేయలేదు ధావన్.

అన్యాయాన్ని సహించి..

టీమ్​లో ఛాన్స్ వస్తే ఆడాడు. జట్టులో నుంచి తీసేస్తే డొమెస్టిక్ క్రికెట్ ఆడటం లేదా ప్రాక్టీస్​లో మునిగిపోవడం మాత్రమే ధావన్​కు తెలుసు. ఎవరితో గొడవలకు దిగడం, విమర్శలు చేయడం, దూషించడం లాంటివి ధావన్​కు తెలియవు. అలాంటోడికి కెప్టెన్సీ విషయంలో అన్యాయం చేశారనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. రోహిత్​, కోహ్లీతో సమానంగా ఆడినా వాళ్లకు దక్కినంత గుర్తింపు, క్రేజ్, ఇంపార్టెన్స్ గబ్బర్​కు రాలేదని ఎక్స్​పర్ట్స్‌ చెబుతుంటారు. ఒకట్రెండు చిన్న సిరీస్​లకు కెప్టెన్సీ ఇచ్చి ఆ తర్వాత తీసేయడం, ఫామ్ కోల్పోయాక ఛాన్సులు ఇవ్వకుండా టీమ్ నుంచి బయటకు పంపడం లాంటివి అతడి కెరీర్​లో జరిగాయి. అయినా తన కోపం, బాధ ఏనాడూ బయటపెట్టకుండా అందరితో మంచిగా ఉంటూ వచ్చాడు ధావన్. అందరి ఫేవరెట్ క్రికెటర్​గా, ఫ్రెండ్​గా ఉన్నాడు. అందుకే క్రికెటర్​గా కంటే అతడి వ్యక్తిత్వానికే చాలా మంది అభిమానులు అయిపోయారు.

బాధంతా కొడుకు గురించే..

ధావన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలిసిందే. ఆయేషా ముఖర్జీతో చాన్నాళ్ల ప్రేమాయణం తర్వాత ఆమెను పెళ్లాడాడు గబ్బర్. 30 అక్టోబర్, 2012లో వీళ్ల వివాహం జరిగింది. చాన్నాళ్లు కలసి ఉన్న ఈ కపుల్.. గతేడాది ఆఖర్లో డివోర్స్ తీసుకున్నారు. ఈ జంటకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత జొరావల్ తల్లి దగ్గరే ఉంటున్నాడు. దీంతో అతడ్ని మిస్ అవుతున్నానంటూ ధావన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతుంటాడు. తన రిటైర్మెంట్ విషయం జొరావర్​కు తెలిస్తే బాగుంటుందని అంటున్నాడు. ప్రొఫెషనల్​ లైఫ్​లో ఫుల్ సక్సెస్ అయిన ధావన్.. పర్సనల్ లైఫ్​లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్యతో డివోర్స్, కుమారుడు దూరమవడంతో అతడు ఒంటరి అయిపోయాడు. ఐపీఎల్-2024లో గాయం బారిన పడకపోతే అతడు ఇంకొన్నాళ్లు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్​కు అందుబాటులో ఉండేవాడు. కానీ ఇంజ్యురీ కారణంగానే రిటైర్మెంట్ నిర్ణయాన్ని కాస్త ముందే తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. మరి.. ధావన్ ఇన్నింగ్స్​ల్లో మీకు బెస్ట్ అనిపించేది ఏదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.