iDreamPost
android-app
ios-app

PAK vs BAN: వీడియో: పొగరు తగ్గించుకోని షకీబ్! ఏం చేశాడో మీరే చూడండి!

  • Published Aug 25, 2024 | 3:04 PM Updated Updated Aug 25, 2024 | 3:04 PM

తాజాగా తన ఓవరాక్షన్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్. పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో షకీబ్ చేసిన ఓవరాక్షన్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

తాజాగా తన ఓవరాక్షన్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్. పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో షకీబ్ చేసిన ఓవరాక్షన్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

  • Published Aug 25, 2024 | 3:04 PMUpdated Aug 25, 2024 | 3:04 PM
PAK vs BAN: వీడియో: పొగరు తగ్గించుకోని షకీబ్! ఏం చేశాడో మీరే చూడండి!

షకీబ్ అల్ హసన్.. ప్రపంచ క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మేటి ఆటగాళ్లను కూడా తన బౌలింగ్ తో బెంబేలెత్తించగల సమర్థుడు. ఇంతటి పేరు ప్రతిష్టలు గల షకీబ్ కు వివాదాస్పదుడు అనే మరో ట్యాగ్ కూడా ఉంది. తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంటాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. తాజాగా తన ఓవరాక్షన్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో షకీబ్ చేసిన ఓవరాక్షన్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ టీమ్ పాకిస్థాన్ లో పర్యటిస్తోంది. అందులో భాగంగా కరాచీ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ లో బంగ్లా టీమ్ విజయం దిశగా సాగుతోంది. కాగా.. 5వ రోజు మ్యాచ్ లో, పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పాక్ 103/4 స్కోర్ వద్ద ఉన్న సమయంలో క్రీజ్ లో అబ్దుల్లా, రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బౌలింగ్ చేయడానికి షకీబ్ అల్ హసన్ వచ్చాడు. స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న రిజ్వాన్ స్లిప్ లో ఉన్న ఫీల్డర్ తో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పటికి అతడు బ్యాటింగ్ చేయడానికి రెడీ కాలేదు. కానీ.. ఈలోపే షకీబ్ పరిగెత్తుకొచ్చి బాల్ ను డైరెక్ట్ గా కీపర్ కు కోపంగా విసిరాడు. దాంతో అంపైర్ అతడికి చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు.

రిజ్వాన్ కావాలనే టైమ్ వేస్ట్ చేస్తున్నాడని భావించిన షకీబ్.. బాల్ ను కోపంగా విసిరినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షకీబ్ ఇంకా నీ పొగరు, ఓవరాక్షన్ తగ్గించుకోలేదా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతడికి సహనం నశించే ఇలా చేశాడు అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 448/6 పరుగులకు డిక్లేర్ చేయగా.. బంగ్లా తన తొలి ఇన్నింగ్స్ లో 565 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం పాక్ రెండో ఇన్నింగ్స్ లో సెకండ్ సెషన్ వరకు 8 వికెట్లకు 142 రన్స్ చేసి, 25 రన్స్ లీడ్ లో ఉంది. మరి షకీబ్ ఓవరాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş