iDreamPost
android-app
ios-app

పాక్‌ను చిత్తు చేసిన అమెరికా వెనకున్న శక్తి ఎవరో తెలుసా?

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అమెరికా, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అమెరికా సూపర్ విక్టరీ కొట్టింది. అయితే ఈ విజయాన్ని సొంతం చేసుకోవడంలో అమెరికా వెనకున్న శక్తి ఎవరో తెలుసా?

టీ20 ప్రపంచకప్ లో భాగంగా అమెరికా, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అమెరికా సూపర్ విక్టరీ కొట్టింది. అయితే ఈ విజయాన్ని సొంతం చేసుకోవడంలో అమెరికా వెనకున్న శక్తి ఎవరో తెలుసా?

పాక్‌ను చిత్తు చేసిన అమెరికా వెనకున్న శక్తి ఎవరో తెలుసా?

ఆట ఏదైనా సరే నిష్ణాతుడైన కోచ్ ఉంటేనే విజయాలు సాధ్యమవుతాయనడంలో సందేహం లేదు. ప్లేయర్స్ కు ఆటలోని మెలుకువలు నేర్పించి మెరుగైన ప్రదర్శన రాబట్టడంలో కోచ్ దే ప్రధాన పాత్ర. ఆటగాళ్ల వెన్నుతట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటారు కోచ్ లు. అమెరికాలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ సంగ్రామం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం నాడు అమెరికా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో యూఎస్ఏ సంచలన విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లో ఉత్తమ ఆటను కనబర్చి పాక్ ను చిత్తు చేసింది. అయితే అమెరికా ఇంతటి విజయాన్ని అందుకోవడంలో ఆటగాళ్లతో పాటు కోచ్ స్టువర్ట్ లా కృషి దాగుంది.

ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ స్టువర్ట్ లా యుఎస్‌ఎ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌. స్పోర్ట్స్‌లో అత్యంత నిష్ణాతులైన కోచ్‌లలో స్టువర్ట్ ఒకరు. క్రికెట్ లో తనకున్న నైపుణ్యం, అవగాహనతో జట్టును స్ట్రాంగ్ గా మార్చి విజయాలను అందించడంలో సిద్ధహస్తుడు. టీమ్ ను ఆత్మవిశ్వాసంతో నడిపించగల సమర్ధుడు. ఈయన సారధ్యంలోనే టీ20 వరల్డ్ కప్ లో అమెరికా జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. స్టువర్ట్ లా 1994లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు. 1996 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడు. అతను 1998లో ఐదుగురు విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 2007లో, అతనికి మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లభించింది.

కాగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ 44 (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్‌ ఖాన్‌ 40 (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పరుగులు సాధించారు. షాహిన్‌ అఫ్రిది 23 (16 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌ 50 (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్‌ జోన్స్‌ 36 (26 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్‌ 35 (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులతో మెరిశారు.

అయితే చివరి ఓవర్‌లో అమెరికా విక్టరీకి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4 సింగిల్స్‌, ఓ సిక్స్‌ వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ వికెట్ నష్టపోయి 13 పరుగులకు పరిమితమై అమెరికా చేతిలో ఓడిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి