iDreamPost
android-app
ios-app

జై షాకు సారీ చెప్పిన లంక సర్కారు.. ఆ విషయంలోనే..!

  • Author singhj Published - 05:03 PM, Sat - 18 November 23

భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీ జై షాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. ఆ విషయంలోనే లంక గవర్నమెంట్ సారీ చెప్పింది.

భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీ జై షాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. ఆ విషయంలోనే లంక గవర్నమెంట్ సారీ చెప్పింది.

  • Author singhj Published - 05:03 PM, Sat - 18 November 23
జై షాకు సారీ చెప్పిన లంక సర్కారు.. ఆ విషయంలోనే..!

క్రికెట్​లో గెలిచిన జట్టును తలమీద పెట్టుకోవడం, ఓడిన టీమ్​పై విమర్శలకు దిగడం కామనే. జెంటిల్మన్ గేమ్ అనే కాదు ఏ ఆటలోనైనా ఇది సర్వసాధారణం. అయితే కోట్లాది మంది ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకున్న ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు ఆడకపోతే మాత్రం విమర్శలు తప్పవు. అందులోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వన్డే వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో చెత్తగా ఆడితే ఎవరూ ఊరుకోరు. ప్రపంచ కప్​లో తన కెప్టెన్సీలో టీమ్ బాగా ఆడలేదనే కారణంతో 2007లో సారథ్య పగ్గాల నుంచి తప్పుకున్నాడు రాహుల్ ద్రవిడ్.  తాజా వరల్డ్ కప్​లో పాకిస్థాన్​ పేలవ పెర్ఫార్మెన్స్​ కారణంగా ఆ టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ రాజీనామా చేశాడు

వరల్డ్ కప్​-2023లో పాక్ సెమీస్​కు చేరుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు బాబర్ ఆజం. జట్టు దారుణంగా విఫలమవ్వడంతో చీఫ్​ సెలెక్టర్ పదవికి ఇంజమాముల్ హక్ రాజీనామా చేశాడు. చెత్త పెర్ఫార్మెన్స్ కారణంగా పాక్ క్రికెట్ బోర్డు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది పీసీబీ. ఇటు పాక్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే.. అటు శ్రీలంకలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. పాక్ కంటే లంక క్రికెట్ సిచ్యువేషన్ డేంజర్​లో ఉంది. ఈ వరల్డ్ కప్​లో ఘోరంగా ఫెయిలైంది శ్రీలంక టీమ్. దీంతో లంక క్రికెట్ బోర్డు (ఎస్​ఎల్​సీ)ను ఆ దేశ సర్కారు రద్దు చేసింది. దాని ప్లేసులో మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది.

లంక క్రికెట్ బోర్డు వ్యవహరాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ఐసీసీ) సీరియస్ అయ్యింది. క్రికెట్ వ్యవహారాల్లోకి గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం తగదంటూ ఎస్​ఎల్​సీపై నిషేధం విధించింది. దీంతో శ్రీలంక టీమ్ వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 వరల్డ్ కప్​లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే మిగిలిన ఐసీసీ టోర్నీల్లోనూ ఆ టీమ్ ఆడకపోవచ్చు. ఈ తరుణంలో లంక క్రికెట్ నాశనం అవ్వడానికి బీసీసీఐ సెక్రెటరీ జై షానే కారణమంటూ అర్జున రణతుంగ ఆరోపించడం హాట్ టాపిక్​గా మారింది. షా కనుసన్నల్లోనే ఎస్​ఎల్​సీ పనిచేస్తోందని.. ఆయన ప్రెజర్​తోనే లంక బోర్డు నాశనమైందని తీవ్ర ఆరోపణలు చేశారు రణతుంగ.

జై షాపై రణతుంగ చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగింది. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన శ్రీలంక ప్రభుత్వం సారీ చెప్పింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ సమావేశాల్లో మంత్రులు కాంచన విజేశేఖర, హరీన్ ఫెర్నాండో కీలక ప్రకటన చేశారు. ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా మీద కొందరు వ్యక్తులు చేసిన కామెంట్స్​ను లంక ప్రభుత్వం ఖండిస్తోంది. మా సంస్థలోని లోపాలు, సమస్యలను ఆయనపై ఆపాదించలేం. అది కరెక్ట్ కాదు’ అని మినిస్టర్ విజేశేఖర అన్నారు. లంక బోర్డుపై విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తేయాలని లేకపోతే ఇక్కడికి ఎవరూ రారన్నారు. క్రికెట్ టోర్నీల ద్వారా తమ దేశానికి ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదన్నారు. కాగా, ఎస్​ఎల్​సీని రద్దు చేస్తూ లంక సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి కోర్టు కొట్టేసింది. మరి.. లంక ప్రభుత్వం జై షాకు సారీ చెప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కప్పు కోసం పూర్తిగా మారిన రోహిత్.. అతడి పని తెలిస్తే షాకవ్వాల్సిందే!