iDreamPost

కప్పు కోసం పూర్తిగా మారిన రోహిత్.. అతడి పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Author singhj Published - 09:21 PM, Fri - 17 November 23

భారత కెప్టెన్ రోహిత్ శర్మలో వరల్డ్ కప్ నెగ్గాలనే కసి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర ప్లేయర్లతో పోలిస్తే అతడి డెడికేషన్ నెక్స్ట్ లెవల్లో ఉండటమే దీనికి కారణం. కప్ కోసం ఎంతగానో మారిన రోహిత్ చేసిన ఒక పని తెలిస్తే మీరూ షాకవుతారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మలో వరల్డ్ కప్ నెగ్గాలనే కసి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర ప్లేయర్లతో పోలిస్తే అతడి డెడికేషన్ నెక్స్ట్ లెవల్లో ఉండటమే దీనికి కారణం. కప్ కోసం ఎంతగానో మారిన రోహిత్ చేసిన ఒక పని తెలిస్తే మీరూ షాకవుతారు.

  • Author singhj Published - 09:21 PM, Fri - 17 November 23
కప్పు కోసం పూర్తిగా మారిన రోహిత్.. అతడి పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

6 వారాల నుంచి క్రికెట్ లవర్స్​ను ఎంతగానో అలరిస్తూ వస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 తుది అంకానికి చేరుకుంది. మొదటి సెమీస్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేసిన భారత్.. రెండో నాకౌట్​లో సౌతాఫ్రికాపై కష్టపడి గెలిచిన ఆస్ట్రేలియాలు ఫైనల్స్​కు చేరుకున్నాయి. ఈ రెండు టీమ్స్ 20 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో తలపడనున్నాయి. 2003 వరల్డ్ కప్​లో ఓటమికి ఈసారి రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది. ఫైనల్ ఫైట్​లో మరోమారు మన టీమ్​కు షాక్ ఇవ్వాలని కంగారూ టీమ్ భావిస్తోంది. మెగా టోర్నీలో ఈ రెండు జట్లు కూడా మ్యాచ్​ మ్యాచ్​కు తమ స్ట్రెంగ్త్​ను పెంచుకుంటూ ఫైనల్​కు చేరుకున్నాయి. ఇరు టీమ్స్​కు ఒకరి బలాబలాలపై మరొకరికి మంచి అవగాహన ఉంది.

ఈసారి టైటిల్ ఫైట్ అంత ఈజీగా ఉండదు. అయితే లీగ్ స్టేజ్​లో కంగారూలపై గెలవడం భారత్​ కాన్ఫిడెన్స్​ను మరింత పెంచే అంశం. స్వదేశంలో ఆడుతుండటం, సొంత ప్రేక్షకుల మద్దతు, బాగా తెలిసిన పిచ్​పై ఆడటం, లీగ్ స్టేజ్​లో ఆసీస్​ను చిత్తు చేయడం టీమిండియాకు కలిసొచ్చే అంశాలు. అయితే ఫైనల్స్​లో ఎలా ఆడాలి, ప్రెజర్​ను తట్టుకొని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలో తెలిసిన ఆస్ట్రేలియాను ఓడించడం భారత్​కు అంత ఈజీ కాదు. లీగ్ దశలో ఆ జట్టు మీద నెగ్గినా.. అప్పటికి, ఇప్పటికి వాళ్ల గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. కండీషన్స్​కు తగ్గట్లు గేమ్​ను ఛేంజ్ చేసుకుంటున్న కంగారూలకు షాక్ ఇవ్వాలంటే భారత్ తన బెస్ట్ ఇవ్వాల్సిందే. అయితే ఇదంతా చూసుకోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడనే నమ్మకం ఫ్యాన్స్​ను నిశ్చింతగా ఉండేలా చేస్తోంది. 2011 వరల్డ్ కప్ టీమ్​లో హిట్​మ్యాన్​కు ప్లేస్ దక్కలేదు.

ఈసారి ఏకంగా జట్టు సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు రోహిత్ శర్మ. ఎలాగైనా వరల్డ్ కప్ కొట్టాలనే కసిలో ఉన్న అతను.. మెగా టోర్నీ కోసం పూర్తిగా ఛేంజ్ ఓవర్ అయ్యాడు. భారత టీమ్ కోసం తనను తాను ఎంతో మార్చుకున్నాడు రోహిత్. ఇది గ్రౌండ్​లో క్లియర్​గా కనిపిస్తోంది. ఇంతకుముందు మైదానంలో అగ్రెసివ్​గా కనిపించేవాడు హిట్​మ్యాన్. క్యాచ్​లు డ్రాప్ చేసినా, రన్స్ ఎక్కువగా ఇచ్చినా అరుస్తూ అసహనంతో ఉండేవాడు. కానీ ఈ వరల్డ్ కప్​లో ఎంతో కూల్​గా ఉంటున్నాడు. ఫీల్డర్లు, బౌలర్లు, బ్యాటర్లు తప్పులు చేసినా వాళ్లకు అండగా ఉంటున్నాడు. మళ్లీ ఆ మిస్టేక్స్ చేయొద్దని చెబుతూ, ఫెయిలైనా వారికి ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు. దాని రిజల్ట్ మ్యాచుల్లో కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి టీమ్​ను ముందుండి నడుపుతున్నాడు హిట్​మ్యాన్.

లేజీగా కనిపించే రోహిత్ ఈ వరల్డ్ కప్​లో మాత్రం ప్రతి విషయంలో అలర్ట్​గా, యాక్టివ్​గా కనిపిస్తున్నాడు. దీనికి తాజాగా ఓ ఘటనను ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. ఆసీస్​తో ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆప్షనల్ ప్రాక్టీస్ ఉండటంతో ప్లేయర్లు ఎవరూ గ్రౌండ్​కు రాలేదు. కానీ రోహిత్ మాత్రం ఒక్కడే మైదానంలోకి దిగాడు. పిచ్​ను పరిశీలిస్తూ, షాడో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. టీమ్ మీద ప్రెజర్ పడొద్దని బ్యాటింగ్​ను పూర్తిగా మార్చుకొని మరింత అగ్రెషన్​తో ఆడుతున్నాడు హిట్​మ్యాన్. అంతేగాక ఇలా తన అలవాట్లు కూడా ఛేంజ్ చేసుకోవడం ద్వారా కప్పు కోసం ఎంత తపన పడుతున్నాడో తన చర్యల ద్వారా చూపిస్తున్నాడు రోహిత్. మరి.. వరల్డ్ కప్ ట్రోఫీ కోసం రోహిత్​ ఛేంజ్ ఓవర్ అవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 2003 వరల్డ్ కప్ ఫైనల్.. 100 కోట్ల మందికి 20 ఏళ్లుగా తీరని పగ అది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి