Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. టీ20 కెప్టెన్సీ దక్కలేదనే బాధలో ఉన్న అతడు.. ఈ సిరీస్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. టీ20 కెప్టెన్సీ దక్కలేదనే బాధలో ఉన్న అతడు.. ఈ సిరీస్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
Nidhan
భారత క్రికెట్‌కు సంబంధించి ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హార్దిక్ పాండ్యాది ఒకటి. ఐపీఎల్-2024కు ముందు గాయంతో చాన్నాళ్లు క్రికెట్‌కు దూరమయ్యాడీ స్టార్ ఆల్‌రౌండర్. రికవర్ అయ్యాక క్యాష్ రిచ్ లీగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా అతడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే టైమ్‌లో టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీలో విఫలమవడంతో పాండ్యాను వరల్డ్ కప్‌కు తీసుకెళ్లొద్దనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ఓపికతో అన్నీ సహిస్తూ వచ్చాడు హార్దిక్. పొట్టి ప్రపంచ కప్‌లో తన బెస్ట్ గేమ్‌తో హీరోగా మారాడు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజేతగా నిలవడంలో అతడిదే ముఖ్య పాత్ర. అయితే ఇంత చేసినా హార్దిక్‌కు అన్యాయం జరిగింది. టీ20 కెప్టెన్సీ విషయంలో అతడికి బీసీసీఐ నుంచి మొండిచెయ్యి ఎదురైంది.
హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు దక్కలేదు. అతడికి బదులు మరో సీనియర్ సూర్యకుమర్ యాదవ్‌ను టీ20 కెప్టెన్ చేసింది బోర్డు. ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగానే పాండ్యాను కెప్టెన్ చేయలేదని కొత్త కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు. తమకు ప్రతి మ్యాచ్ అందుబాటులో ఉండే సారథి కావాలని.. అందుకే హార్దిక్‌కు బదులు సూర్యను తీసుకున్నామని తెలిపాడు. కెప్టెన్సీ రాలేదనే బాధ వెంటాడుతున్న టైమ్‌లోనే లంక సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు హార్దిక్. ఒకవైపు ఫ్యామిలీ ఇష్యూస్, మరోవైపు సారథ్యం దక్కకపోవడంతో ఈ సిరీస్‌లో అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అంశంపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్సీ దక్కనందుకు పాండ్యా ఎగిరి గంతేయాలన్నాడు.
హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే కరెక్ట్ అన్నాడు ఊతప్ప. ‘పాండ్యా ప్లేసులో నేను ఉంటే కెప్టెన్సీ వద్దనే చెబుతా. నేషనల్ టీమ్‌కు సేవలు అందించడం కోసం సారథ్యానికి దూరంగా ఉండమన్నా సంతోషంగా సరే అని చెబుతా. ఎక్కువ కాలం కెరీర్ పొడిగించుకోవడానికి దీన్ని మించిన మార్గం మరొకటి లేదు. ఏ ప్లేయర్ అయినా దేశానికి సాధ్యమైనన్ని వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిపించడమే ధ్యేయంగా ఆడాలి. ఆటగాడిగా ఉన్నా కెప్టెన్‌గా ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదు. టీమ్‌లో ఉంటే చాలు. హార్దిక్ గురించి నాకు బాగా తెలుసు. సారథ్యం దక్కనందుకు అతడు బాధపడినా వెంటనే తేరుకుంటాడు. జట్టుకు అతడు పెద్ద బలం. సూర్యకుమార్‌కు ఏదైనా ఇంజ్యురీ అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు హార్దిక్ ఎలాగూ రెడీగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అతడి లాంటి సామర్థ్యం ఉన్న ఆటగాడు టీమ్‌లో మరొకరు లేరు. ఇలాంటి ఆల్‌రౌండర్లు చాలా అరుదు’ అని ఊతప్ప మెచ్చుకున్నాడు. మరి.. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడం సరైనదేననే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.