iDreamPost
android-app
ios-app

SAW vs AUSW: వీడియో: అంపైర్‌ చేసిన పనికి అంతా షాక్‌! చెవిటి మాలోకం అంటూ..

  • Published Feb 07, 2024 | 3:33 PM Updated Updated Feb 07, 2024 | 3:33 PM

తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో అంపైర్ చేసిన పనికి గ్రౌండ్ లోని ప్లేయర్లతో సహా అందరూ షాక్ కు గురైయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో అంపైర్ చేసిన పనికి గ్రౌండ్ లోని ప్లేయర్లతో సహా అందరూ షాక్ కు గురైయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

SAW vs AUSW: వీడియో: అంపైర్‌ చేసిన పనికి అంతా షాక్‌! చెవిటి మాలోకం అంటూ..

క్రికెట్ లో కొన్నిసార్లు అంపైర్లు చేసే తప్పిదాలు నవ్వులు పూయిస్తాయి. అయితే ఫన్నీ మూమెంట్స్ తో ఎలాంటి ఇబ్బందులు ఉండవు గానీ.. వారు చేసే తప్పిదాల వల్ల ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలే తారుమారైతాయి. దీంతో కీలక టోర్నీల నుంచి జట్లు ఇంటిదారి పట్టే పరిస్థితులు వస్తాయి. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో అంపైర్ చేసిన పనికి గ్రౌండ్ లో ప్లేయర్లతో సహా ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. మరి ఇంతకీ ఆ అంపైర్ చేసిన పనేంటి? నెటిజన్లు ఎందుకు చెవిటి మాలోకం అంటూ ట్రోల్ చేస్తున్నారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతాఫ్రికా వుమెన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య సిడ్నీ వేదికగా వన్డే మ్యాచ్ జరుగుతొంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టుకు తొలి ఓవర్ లోనే షాకిచ్చింది మెగాన్ షట్. మూడో బంతికే కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌతాఫ్రికా బ్యాటర్ లూస్ 14 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేయడానికి వచ్చింది డార్డెనర్. ఈ ఓవర్ చివరి బంతిని లూస్ స్వీప్ షాట్ ఆడగా.. బాల్ మిస్ అయ్యి ప్యాడ్స్ కు తగిలింది. దాంతో బౌలర్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చింది.

దీంతో ఆసీస్ టీమ్ రివ్యూకి వెళ్లింది. రిప్లేలో మరోసారి చూడగా.. బాల్ ఔట్ సైడ్ వెళ్లినట్లు తేలడంతో.. థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఈ విషయాన్ని మైక్ ద్వారా గట్టిగానే అనౌన్స్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ కి అది సరిగ్గా వినిపించకపోవడం లేదా కన్ఫ్యూస్ కావడంతో.. అవుట్ అంటూ చేతిని పైకి ఎత్తింది. దీంతో అందరూ షాక్ కు గురైయ్యారు. ఆసీస్ ఫీల్డర్లు నవ్వడంతో వెంటనే తప్పు తెలుసుకుని నాటౌట్ అంటూ ప్రకటించి.. చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. పాపం అంపైర్ చెవిటి అనుకుంటా, మిషన్ కొనివ్వాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఏ లోకంలో ఉన్నావ్? జర మ్యాచ్ పై ఫోకస్ పెట్టు అంటూ రాసుకొచ్చారు. మరి అంపైర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పాక్ ను గడగడలాడించిన కుంబ్లే.. ఆ అద్భుతానికి 25 ఏళ్లు!