iDreamPost

VIDEO: రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్.. రిజ్వాన్ రియాక్షన్​కు ఫిదా అవ్వాల్సిందే!

  • Author singhj Published - 09:14 PM, Fri - 27 October 23

వరల్డ్ కప్​-2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​కు సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతోంది. బౌలర్ రెచ్చగొట్టినప్పటికీ రిజ్వాన్ స్పందించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే.

వరల్డ్ కప్​-2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​కు సంబంధించిన ఒక విషయం వైరల్ అవుతోంది. బౌలర్ రెచ్చగొట్టినప్పటికీ రిజ్వాన్ స్పందించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే.

  • Author singhj Published - 09:14 PM, Fri - 27 October 23
VIDEO: రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్.. రిజ్వాన్ రియాక్షన్​కు ఫిదా అవ్వాల్సిందే!

క్రికెట్​లో స్లెడ్జింగ్ అనేది చాలా కామన్. గల్లీ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ వరకు స్లెడ్జింగ్​ను చూస్తూనే ఉంటాం. డొమెస్టిక్ లెవల్​తో పాటు లీగ్స్​లోనూ స్లెడ్జింగ్ ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. స్లెడ్జింగ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా టీమే. ఒకర్ని మించి ఒకరు భీకరమైన ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ, వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ ఆసీస్ స్లెడ్జింగ్ మంత్రాన్ని అవసరమైనప్పుడు వాడేది. రికీ పాంటింగ్ కెప్టెన్సీ టైమ్​లో ఇది పీక్​ లెవల్​కు వెళ్లిపోయింది. ఆ తర్వాత కాలంలో ఇది కాస్త తగ్గింది. కంగారూలతో పాటు ఇతర టీమ్స్ కూడా స్లెడ్జింగ్​ను తగ్గించుకున్నాయి.

వికెట్లు పడని టైమ్​లో ఫీల్డింగ్ టీమ్స్ స్లెడ్జింగ్​కు దిగడం చూస్తూనే ఉంటాం. అయితే స్లెడ్జింగ్​కు ఒక్కొక్కరూ ఒక్కోలా సమధానం ఇస్తారు. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్లు ఎంత స్లెడ్జింగ్ చేసినా బ్యాట్​తోనే ఆన్సర్ చేసేవారు. కానీ విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు దీనికి మినహాయింపు అనే చెప్పాలి. కోహ్లీని స్లెడ్జ్ చేస్తే వాళ్ల పనైపోయినట్లే. తనను గెలికిన వారికి మాటలతో పాటు బ్యాట్​తోనూ స్ట్రాంగ్​గా రిప్లయ్ ఇస్తాడు కింగ్. ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు ఐపీఎల్​లోనూ దీన్ని చూశాం. అందుకే కోహ్లీ జోలికి ఎవ్వరూ పోరు. స్లెడ్జింగ్​కు ఒక్కో బ్యాటర్ ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు.

కొందరైతే బౌలర్లు మాటలతో కవ్వించినా, బౌన్సర్లతో భయపెట్టినా, బూతులతో రెచ్చగొట్టినా కూల్​గా నవ్వేస్తారు. తమ పనేదో తాము చేసుకుపోతారు. సౌతాఫ్రికాతో మ్యాచ్​లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అలాగే చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. అసలైన క్రీడాస్ఫూర్తి ఎలా ఉంటుందో ప్రూవ్ చేశాడు. ఈ మ్యాచ్​లో సఫారీ పేసర్ జాన్సేన్ రిజ్వాన్​కు ఒక బౌన్సర్ వేశాడు. వికెట్ పడకపోయేసరికి బూతుల దండకం అందుకున్నాడు. అయినా రిజ్వాన్ మాత్రం చిరునవ్వుతో బదులిచ్చాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్స్.. రిజ్వాన్​కు ఇంగ్లీష్ రాదు కాబట్టే అతడు రియాక్ట్ కాలేదని సెటైర్స్ వేస్తున్నారు. రిజ్వాన్ మృదు స్వభావి అని.. అందుకే బౌలర్ రెచ్చగొట్టినా అతడు స్పందించలేదని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రిజ్వాన్ రియాక్షన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్లను చూసి నేర్చుకోండి.. ఇంగ్లాండ్ జట్టుకు మాజీ కెప్టెన్ చురకలు

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి