iDreamPost

టీమిండియా ప్లేయర్లను చూసి నేర్చుకోండి.. ఇంగ్లాండ్ జట్టుకు మాజీ కెప్టెన్ చురకలు

  • Author Soma Sekhar Published - 06:12 PM, Fri - 27 October 23

శ్రీలంకపై ఓటమితో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తమ జట్టును ఏకిపారేశాడు. వరల్డ్ కప్ కు ఎలా సన్నద్దం అవ్వాలో టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ.. తమ ప్లేయర్లకు చురకలు అంటించాడు.

శ్రీలంకపై ఓటమితో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తమ జట్టును ఏకిపారేశాడు. వరల్డ్ కప్ కు ఎలా సన్నద్దం అవ్వాలో టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ.. తమ ప్లేయర్లకు చురకలు అంటించాడు.

  • Author Soma Sekhar Published - 06:12 PM, Fri - 27 October 23
టీమిండియా ప్లేయర్లను చూసి నేర్చుకోండి.. ఇంగ్లాండ్ జట్టుకు మాజీ కెప్టెన్ చురకలు

వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కథ దాదాపుగా ముగిసినట్లే. గత ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా ఈ వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్ లు తగిలాయి. ఆఫ్గాన్, శ్రీలంక జట్లు జగజ్జేత ఇంగ్లాండ్ కు భారీ షాకులు ఇచ్చాయి. ఇక ఈ మెగాటోర్నీలో ఐదు మ్యాచ్ ల్లో నాలుగింట ఓడి, ఓ మ్యాచ్ లో మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. తాజాగా శ్రీలంకపై ఓటమితో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ మ్యాచ్ ను పటిష్టమైన టీమిండియాతో ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తమ జట్టును ఏకిపారేశాడు. వరల్డ్ కప్ కు ఎలా సన్నద్దం అవ్వాలో టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ.. తమ ప్లేయర్లకు చురకలు అంటించాడు.

ఇంగ్లాండ్ ఓ వన్డే వరల్డ్ కప్ తో పాటుగా.. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా భారీ అంచనాలతో ఈ వరల్డ్ కప్ బరిలోకి దిగింది. అయితే అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతోంది. ఆఫ్గాన్, శ్రీలంక లాంటి జట్లపై ఓటమి చవిచూసి.. తీవ్ర విమర్శల పాలైంది. ఈ మెగాటోర్నీలో ఐదు మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో ఓడి.. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఈ క్రమంలో జట్టుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”ఇంగ్లాండ్ జట్టు 2019 వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఎంతో ఆనందించాం. కానీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో మా జట్టు ఆటతీరు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది.

అయితే నాకు నచ్చని విషయాలు వారికి ఆపాదించడం మంచిదికాదు. ఇక మా టీమ్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీ20, 100 బాల్ క్రికెట్, టెస్ట్ మ్యాచ్ లు ఎక్కువగా ఆడింది. కావాల్సినంత వన్డేలు మాత్రం ఆడలేదు. అయితే ఇదే సమయంలో టీమిండియా ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రాహుల్, రోహిత్, గిల్ లాంటి ఆటగాళ్లు టీ20ల్లో నుంచి చాలా నేర్చుకుని.. ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం దారుణంగా విఫలం అవుతూ.. వరల్డ్ కప్ నుంచి ఇంటిదారి పట్టడానికి సిద్దమవుతున్నారు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ వ్యూహాలు అస్సలు బాలేవు. ఆల్ రౌండర్లను నమ్ముకున్నా కానీ.. ఫలితం దక్కలేదు. కాగా.. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలకు సిద్దం అవ్వడం ఎలాగో.. టీమిండియాను చూసి నేర్చుకోవాలి” అంటూ సొంత జట్టు ప్లేయర్లకు చురకలు అంటించాడు.

ఇక మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లాక..ప్రతి ఒక్కరినీ తమ గుండెల మీద చేయి వేసుకుని.. ఇవాళ నేను బాగా ఆడాను అని అడగండి, ఒక్కరిద్దరు కూడ అలా అనరేమో.. అని ఏకిపారేశాడు నాసిర్ హుస్సేన్. ఈ సందర్భంగా టీమిండియా బ్యాటర్లు అయిన రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీ, గిల్ లు అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు. సౌతాఫ్రికాలో కూడా ప్రతీ ఒక్క ఆటగాడు సూపర్ ఫామ్ లో ఉన్నారంటూ కితాబిచ్చాడు. మరి సొంత జట్టు ప్లేయర్లను ఏకిపారేసిన నాసిర్ హుస్సేన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి