ధోని రికార్డును బ్రేక్ చేసిన డికాక్.. అయినా ఆ విషయంలో మాహీ వెనుకే..!

  • Author singhj Updated - 10:54 AM, Wed - 25 October 23

ఈ వరల్డ్ కప్​లో సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వీర ఫామ్​లో ఉన్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నాడీ లెఫ్టాండర్. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లోనూ తన ఫామ్​ను కంటిన్యూ చేశాడు.

ఈ వరల్డ్ కప్​లో సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వీర ఫామ్​లో ఉన్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నాడీ లెఫ్టాండర్. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లోనూ తన ఫామ్​ను కంటిన్యూ చేశాడు.

  • Author singhj Updated - 10:54 AM, Wed - 25 October 23

వన్డే వరల్డ్ కప్-2023లో పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతూ వరుస విజయాలు సాధిస్తోంది సౌతాఫ్రికా. అండర్​డాగ్స్​గా మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన బవుమా సేన.. తమకు ఉన్న వనరుల్ని చక్కగా యూజ్ చేసుకుంటోంది. ఫస్ట్ బ్యాటింగ్​కు దిగి భారీ స్కోర్లు బాదేయడం.. ఆ తర్వాత ప్రత్యర్థి టీమ్​ను చుట్టేసి గెలుపు సొంతం చేసుకోవడమనే ప్లాన్​ను పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తోంది సఫారీ టీమ్. ఈ సారి సౌతాఫ్రికా వలలో చిక్కుకుంది బంగ్లాదేశ్. సూపర్ ఫామ్​లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్ భారీ సెంచరీతో చెలరేగడంతో పరుగుల వరద పారించిన బవుమా సేన.. బంతితో బంగ్లాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 రన్స్ చేసింది. డికాక్ (140 బంతుల్లో 174) టోర్నీలో మూడో సెంచరీతో చెలరేగాడు. క్లాసెన్ (49 బంతుల్లో 90), మార్​క్రమ్ (69 బంతుల్లో 60), మిల్లర్ (15 బంతుల్లో 34 నాటౌట్) రాణించారు. ఛేజింగ్​లో సఫారీ బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ 233కే చాప చుట్టేసింది. సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా (111) సెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ (3/62), లిజాడ్ విలియమ్స్ (2/56), జాన్సేన్ (2/39), రబాడ (2/42) గెలుపులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాతో మ్యాచ్​లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసిందంటే ప్రధాన కారణం డికాక్ అని చెప్పాలి. సుడిగాలి ఇన్నింగ్స్​తో మరోసారి అదరగొట్టాడీ లెఫ్టాండ్ బ్యాటర్.

ఇప్పటికే మెగా టోర్నీలో రెండు సెంచరీలు దంచేసిన డికాక్.. బంగ్లాదేశ్​ మీదా అదే జోరును కంటిన్యూ చేశాడు. ఈ మ్యాచ్​లో ఏడు సిక్సులు బాదిన డికాక్.. ఒక వరల్డ్ కప్​ ఎడిషన్​లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్​గా కొత్త రికార్డు సృష్టించాడు. కీపర్​గా సిక్సర్ల విషయంలో రికార్డును క్రియేట్ చేసినప్పటికీ.. మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న మరో రికార్డును మాత్రం డికాక్ చెరపలేకపోయాడు. ఈ మ్యాచ్​లో డికాక్ 178 రన్స్ చేశాడు. మరో 6 రన్స్ చేస్తే అతడు మరో మైల్​స్టోన్​ను అందుకునేవాడు. వన్డే క్రికెట్​లో అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్​గా ధోని (183 నాటౌట్) ఉన్నాడు. ధోని రికార్డును అందుకోకపోయినా అతడి వెనకాలే రెండో స్థానంలో నిలిచాడు డికాక్. మరి.. డికాక్ సుడిగాలి ఇన్నింగ్స్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: డికాక్‌ సునామీ ఇన్నింగ్స్‌! టీమిండియా మాజీ కోచ్‌ రికార్డ్‌ పదిలం

Show comments