కోల్‌కతా డాక్టర్‌ కేసు: న్యాయం కోసం రోడ్డుపైకి గంగూలీ! ఇక ప్రభుత్వాలు కదిలొస్తాయి!

Sourav Ganguly, Kolkata Doctor Case, Kolkata: టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ న్యాయం కోసం రోడ్డుపైకి రానున్నాడు. అది కూడా కుటుంబంతో సహా. కోల్‌కతా డాక్టర్‌ కేసులో దాదా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Sourav Ganguly, Kolkata Doctor Case, Kolkata: టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ న్యాయం కోసం రోడ్డుపైకి రానున్నాడు. అది కూడా కుటుంబంతో సహా. కోల్‌కతా డాక్టర్‌ కేసులో దాదా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ కోల్‌కత్తా రోడ్లపై ర్యాలీ చేసిన నిరసన తెలిపేందుకు సిద్ధం అవుతున్నాడు. భార్య, కూతురితో సహా దాదా ధర్నాకు దిగనున్నాడు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ అండ్‌ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. డాక్టర్లు, సామాన్యులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను కూడా ఈ నిరసనలో భాగం కావాలని, బాధితురాలికి న్యాయం చేస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ.. బుధవారం నిరసన ర్యాలీలో పాల్గొంటానని గంగూలీ ప్రకటించాడు. గంగూలీ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలెర్ట్‌ అయినట్లు సమాచారం. బాధితురాలికి న్యాయం కోసం గత పది రోజులుగా జరుగుతున్న నిరసనలు దాదా రాకతో మరింత ఉధృతం అవ్వడం ఖాయం.

అయితే.. ఈ ఘటనపై ఈ నెల 11న గంగూలీ చేసిన ఒక ప్రకటనతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డాక్టర్‌ హత్యాచార ఘటనపై గంగూలీ స్పందిస్తూ.. ‘ఇలాంటి దారుణ సంఘటన జరగడం నిజం చాలా బాధాకరం. మహిళల రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగొచ్చు. కానీ, మనం మంచి భద్రతా వ్యవస్థనే కలిగి ఉన్నాం. మనం ఒక గొప్ప దేశంలో ఉంటున్నాం. పశ్చిమ బెంగాల్‌ అనే కాదు.. అన్ని రాష్ట్రాల్లో మంచి భద్రత ఉంది. మనం ఒక గొప్ప రాష్ట్రం, మహానగరంలో ఉంటున్నాం.. ఒక్క సంఘటనను పట్టుకుని.. ఇలా జడ్జ్‌ చేయడం సరికాదు. ఏది ఏమైనా.. బాధితురాలికి న్యాయం జరగాలి’ అని దాదా అన్నాడు.

దాదా చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. నైట్‌ డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై, ఒక పెద్ద హాస్పిటల్‌లో ఇంత పైశాచికంగా 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై ఇంతటి దారుణ ఘటన జరిగితే.. మన దేశంలో మంచి సెక్యూరిటీ ఉంది, ఒక్క సంఘటనను పట్టుకుని ఎవర్ని నిందించకూడదంటూ నీతులు చెప్పడం ఏంటని అంతా మండిపడ్డారు. ఒక క్రికెటర్‌గా నిన్ను ఎంతో ఇష్టపడ్డామని, నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఆశించలేదంటూ.. ఆయన అభిమానులు సైతం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఇదే విషయమై ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా కూడా గంగూలీపై విమర్శలు చేశారు. తనపై వస్తున్న విమర్శలకు జవాబులా కాకుండా.. ఒక బాధితురాలికి న్యాయం జరిగేందుకు తన వంతు బాధ్యతగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటానంటూ గంగూలీ ముందుకు రావడంతో అంత అభినందిస్తున్నారు. అయితే.. కోల్‌కతా ఫిన్స్‌గా, మహరాజాగా, బెంగాల్‌ టైగర్‌గా కీర్తించబడే గంగూలీ రోడ్డుపైకి వస్తే.. ఇక పశ్చిమ బెంగాల్‌ షేక్‌ అవ్వడం ఖాయమంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments