iDreamPost
android-app
ios-app

వీడియో: బెంగాల్‌ రోడ్లపై తెలుగు హీరోయిన్‌ డ్యాన్స్‌! ఎందుకో తెలిస్తే శభాష్‌ అంటారు!

  • Published Sep 17, 2024 | 4:31 PM Updated Updated Sep 17, 2024 | 4:31 PM

Mokksha Sengupta, Kolkata, RG Kar Medical College: ఓ తెలుగు హీరోయిన్‌ బెంగాల్‌ రోడ్లపై డ్యాన్స్‌ వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆమె రోడ్డుపై ఎందుకు డ్యాన్స్‌ వేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Mokksha Sengupta, Kolkata, RG Kar Medical College: ఓ తెలుగు హీరోయిన్‌ బెంగాల్‌ రోడ్లపై డ్యాన్స్‌ వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆమె రోడ్డుపై ఎందుకు డ్యాన్స్‌ వేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 17, 2024 | 4:31 PMUpdated Sep 17, 2024 | 4:31 PM
వీడియో: బెంగాల్‌ రోడ్లపై తెలుగు హీరోయిన్‌ డ్యాన్స్‌! ఎందుకో తెలిస్తే శభాష్‌ అంటారు!

స్టార్‌ హీరోయిన్స్‌ అన్నాక పెద్దగా బయటికి రారు.. సినిమాల్లో, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మహా అయితే.. ఏదైన పెద్ద షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి, అవార్డ్‌ ఫంక్షన్స్‌కు వస్తుంటారు. ఏదైన సోషల్‌ కాజ్‌పై స్పందించాలన్నా.. సోషల్‌ మీడియాలోనే స్పందిస్తారు. కానీ, ఓ హీరోయిన్‌ మాత్రం సమాజంలో జరిగిన ఓ దారుణంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఎవ్వరూ ఊహించని కొత్త పద్ధతిని ఎంచుకుంది. రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తూ.. ఓ అమ్మాయిపై జరిగిన అకృత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి, బాధితురాలికి న్యాయం జరగాలని ఎలుగెత్తి చాటింది. ఈ గొప్ప పని చేసిన నటి ఎవరంటే.. మోక్షా సేన్‌గుప్తా.

దేశాన్ని కుదిపేసిన ‘కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార’ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ.. నటి మోక్షా సేన్‌గుప్తా బెంగాల్‌ రోడ్లపై నృత్యం చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశం తలదించుకునేలా.. జరిగిన ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్‌ ఫుల్‌ డ్యాన్స​ అందర్ని ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌ అయి ఉండి.. ఒక ట్వీట్‌తోనే సరిపెట్టుకుండా.. సామాన్య ప్రజలతో కలిసి రోడ్డు మీదకొచ్చి.. నిరసన తెలుపుతూ డ్యాన్స్‌ కూడా చేయడంతో ఆమెపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సెలబ్రెటీల నుంచి ఇది కదా సమాజానికి కావాల్సింది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అత్యంత దారుణమైన ఘటనలు చోటు చేసుకున్న సమయంలో.. సెలబ్రెటీలు ఇలా బయటికి వచ్చి తమ గొంతు వినిపిస్తే.. ప్రభుత్వాలు కూడా భయపడతాయని అంటున్నారు నెటిజన్లు.

ఇక కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ.. పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా డాక్టర్లు గత నెల రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారి డిమాండ్లకు మమతా బెనర్జీ ప్రభుత్వం ఒప్పుకొంది. రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారిపై వేటు వేసింది. అలాగే మరికొన్ని డిమాండ్లకు ఓకే చెప్పింది. ఇక రోడ్డుపై డ్యాన్స్‌ వేసి ప్రశంసలు అందుకున్న మోక్షా సేన్‌గుప్తా.. బెంగాల్ నటి. ఆమె మంచి డ్యాన్సర్‌ కూడా. అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ‘నీతోనే నేను’, ‘అలనాటి రామచంద్రుడు’, ‘ఐ హేట్‌ యూ’ వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ధన్‌రాజ్‌, సముద్రఖని ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘రామం రాఘవం’ సినిమాలో కూడా మోక్షా నటిస్తోంది. తెలుగులో మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది మోక్షా. మరి ఈ నటి.. తన గొప్ప మనసును చాటుకుంటూ.. ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం జరగాలని రోడ్డుపై డ్యాన్స్‌ వేసి నిరసన తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet