iDreamPost
android-app
ios-app

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసు.. సాక్ష్యాలు తారుమరుపై ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్!

  • Published Sep 15, 2024 | 12:52 PM Updated Updated Sep 15, 2024 | 1:11 PM

Kolkata Doctor Case: ఇటీవల మహిళలపై నిత్యం లైంగిక వేధింపులు, అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత నెల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది.

Kolkata Doctor Case: ఇటీవల మహిళలపై నిత్యం లైంగిక వేధింపులు, అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత నెల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసు.. సాక్ష్యాలు తారుమరుపై ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్!

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఉదంతం దేశం మొత్తం కలచివేసింది. ఈ ఘటన తర్వాత సామాన్యులు, వైద్యులు, సినీ, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున్న నిరసనలు తెలిపారు. అంతేకాదు ఈ ఘటనను సుమోటాగా సర్వోన్నత న్యాస్థానం స్వీకరించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆర్జీ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గత నెల కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ పై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు ఓ పోలీస్ అధికారిని సీబీఐ శనివారం రాత్రి అరెస్ట్ చేసింది. ఆర్జీ కర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా కొనసాగే సమయంలో పలు అవకతవకలకు పాల్పపడిన కేసులో ఇప్పటికే సీబీఐ సందీప్ ఘోష్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో సందీప్ ని అరెస్ట్ చేశారు.

ట్రైనీ డాక్టర్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించారని జూనియర్ డాక్టర్లు ఆరోపణలు చేయడం వల్లనే మాజా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు పోలీస్ అధికారి అభిజిత్ మోండల్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సందీప్ ఘోష్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు సంబరాలు చేసుకున్నారు. తాము కోరుకున్నది జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ట్రైనీ డాక్టర్ చనిపోయిన సమాచారం తెలిసినా వెంటనే ఆయన పోషించిన పాత్రను వివరించాలని సీబీఐ అధికారు ఆయనను ప్రశ్నిస్తూ వచ్చారు. మరోవైపు ఈ కేసు సీఎం మమతా కూడా కీలక సీరియస్ గా ఉన్నట్లు తెలిసిందే.