iDreamPost
android-app
ios-app

వృద్ధిమాన్ సాహాను ఆ విషయంలో రిక్వెస్ట్ చేసిన గంగూలీ! అతడిపై అంత ప్రేమకు కారణం?

  • Published May 29, 2024 | 10:52 AM Updated Updated May 29, 2024 | 11:13 AM

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను ఓ విషయంలో రిక్వెస్ట్ చేశాడు భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ. దాంతో సాహాపై దాదాకు ఇంత ప్రేమ ఉందా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను ఓ విషయంలో రిక్వెస్ట్ చేశాడు భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ. దాంతో సాహాపై దాదాకు ఇంత ప్రేమ ఉందా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వృద్ధిమాన్ సాహాను ఆ విషయంలో రిక్వెస్ట్ చేసిన గంగూలీ! అతడిపై అంత ప్రేమకు కారణం?

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ను బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ ఓ కోరికను కోరాడు.  ఆ కోరికను త్రిపుర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయంత డే వెల్లడించాడు. దాంతో సాహాపై దాదాకు ఇంత ప్రేమ ఉందా? దానికి కారణం ఏంటి? అని క్రికెట్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వృద్ధిమాన్ సాహా.. తన చివరి మ్యాచ్ ను సొంత రాష్ట్రం అయిన బెంగాల్ తరఫున ఆడాలని కోరాడు భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ. ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయంత డే చెప్పుకొచ్చాడు. దశాబ్దానికిపైగా బెంగాల్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు సాహా. కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అయితే ఏమైందో ఏమోకానీ.. 2022 లో త్రిపుర టీమ్ లో చేరాడు సాహా. ఇదిలా ఉండగా.. తాజాగా సౌరవ్ గంగూలీతో కోల్ కత్తాలో సాహా సమావేశం అయ్యాడని ప్రముఖ వార్త పత్రిక పీటీఐ తెలిసింది.

“బెంగాల్ తరఫున రిటైర్మెంట్ కావాలని, చివరి మ్యాచ్ బెంగాల్ జట్టు తరఫునే ఆడాలని సాహాను గంగూలీ కోరాడు. సాహా కూడా నాతో ఈ విషయం చెప్పాడు. కానీ ఇప్పటి వరకు త్రిపుర క్రికెట్ అసోసియేషన్ నుంచి NOC (నో అబ్జెక్షన్ లెటర్)  అడగలేదు” అని జయంత డే చెప్పుకొచ్చాడు. అయితే సాహాపై దాదాకు ఇంత ప్రేమ ఉండటానికి కారణం ఏంటంటే? సాహా బెంగాల్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి దాదా అడుగుజాడల్లోనే నడిచేవాడు. దాంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. సాహా కూడా గంగూలీని తన గురువుగా భావించేవాడు.

ఒకనొక సందర్భంలో నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని దాదా భరోసా ఇచ్చాడు. సాహా మంచి ఇన్నింగ్స్ లు ఆడి జట్టును ఆదుకున్నప్పుడల్లా గంగూలీ పర్సనల్ గా అభినందించేవాడు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతడిని చివరి మ్యాచ్ బెంగాల్ తరఫున ఆడాలని దాదా కోరాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో సాహా దారుణంగా విఫలం అయ్యాడు. 9 మ్యాచ్ ల్లో కేవలం 136 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.