Nidhan
భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చాడు సౌరవ్ గంగూలీ. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా టీమిండియాకు దూకుడు నేర్పించాడు. పెద్ద జట్ల మీద ఎలా గెలవాలో చూపించాడు. చాలా మంది యంగ్‌స్టర్స్‌ను ఎంకరేజ్ చేసి స్టార్లుగా తీర్చిదిద్దాడు. అలాంటి దాదా లైఫ్ మీద ఓ సినిమా రానుంది.
భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చాడు సౌరవ్ గంగూలీ. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా టీమిండియాకు దూకుడు నేర్పించాడు. పెద్ద జట్ల మీద ఎలా గెలవాలో చూపించాడు. చాలా మంది యంగ్‌స్టర్స్‌ను ఎంకరేజ్ చేసి స్టార్లుగా తీర్చిదిద్దాడు. అలాంటి దాదా లైఫ్ మీద ఓ సినిమా రానుంది.
Nidhan
బయోపిక్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్. జీవితంలో బాగా సక్సెస్ అయిన సైంటిస్టులు, సినీ తారలు, క్రికెటర్స్, పొలిటీషియన్స్ లైఫ్‌ను ఆధారంగా తీసుకొని మూవీస్ తీయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ప్రముఖుల జీవితాల్లోని వైఫల్యాలు, వివాదాలు, కష్టాలు, ఓటమి నుంచి గెలుపు దిశగా ప్రయాణం లాంటివి హైలైట్ చేస్తూ చాలా బయోపిక్స్ తెరకెక్కాయి. వీటిలో కొన్ని పెద్దగా ఆడలేదు.. కానీ మరికొన్ని మాత్రం బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ‘మహానటి’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘ఎంఎస్ ధోని’, ‘సంజూ’ లాంటి బయోపిక్ మూవీస్ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో నిజ జీవిత కథలపై సినిమాలు తీయడం పెరిగింది. ఈ కోవలోనే మరో బయోపిక్ రూపొందనుంది. టీమిండియా లెజెండ్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితంపై సినిమా తీయనున్నారు. ఈ బయోపిక్‌లో నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ నటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారత క్రికెట్ జట్టు గమనాన్ని మార్చిన గంగూలీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కనుంది. టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా లైఫ్‌లోని విశేషాలతో రూపొందనున్న ఫిల్మ్‌లో నేషనల్ అవార్డు విన్నర్ ఆయుష్మాన్ ఖురానా నటించనున్నారని తెలిసింది. గంగూలీ క్యారెక్టర్‌ను ఆయన పోషించనున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని తెరకెక్కించనున్న ఈ చిత్రం.. ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. లవ్ రంజన్, అంకుర్ గార్గ్‌లు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఫిల్మ్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టర్ మోత్వానీలు గంగూలీ బయోపిక్ కోసం రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దాదా ఎక్స్ప్రెషన్స్, అతడి బ్యాటింగ్ స్టైల్, తదిరత అంశాల మీద స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట ఖురానా.
ఆయుష్మాన్ ఖురానా ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత గంగూలీ బయోపిక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, కపిల్ దేవ్, మిథాలీ రాజ్ లాంటి ప్రముఖ క్రికెటర్ల బయోపిక్స్ వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నేపథ్యంలో దాదా బయోపిక్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా, భవిష్యత్‌కు బాటలు వేసిన సారథిగా, దూకుడు నేర్పించిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న దాదా కెరీర్లో కాంట్రవర్సీలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో ఈ సినిమాను డైరెక్టర్ మోత్వానీ ఎలా తీస్తాడోననేది ఆసక్తిని కలిగిస్తోంది. మోత్వానీ గతంలో ‘లూటేరా’, ‘ఎన్‌హెచ్ 10’, ‘ఉడాన్’, ‘బాంబే వెల్వెట్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి హిట్స్ తీశారు. దీంతో దాదా బయోపిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువవుతున్నాయి. మరి.. గంగూలీ బయోపిక్ చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భువీ ఈజ్ బ్యాక్.. ఏకంగా 8 వికెట్లతో వణికించాడు!
Ayushman khurrana#ayushmankhurana pic.twitter.com/05KsyOUOuI
— RVCJ Sports (@RVCJ_Sports) January 13, 2024