బుమ్రాకు BCCI అన్యాయం! గిల్ మీద అతి నమ్మకం మంచిదేనా?

Jasprit Bumrah: టీమిండియా పేస్ గన్ జస్​ప్రీత్ బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ క్రికెట్​తో అలసిపోయిన పేసుగుర్రం ఇప్పుడు ఖాళీ టైమ్​ను ఫ్యామిలీతో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు.

Jasprit Bumrah: టీమిండియా పేస్ గన్ జస్​ప్రీత్ బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ క్రికెట్​తో అలసిపోయిన పేసుగుర్రం ఇప్పుడు ఖాళీ టైమ్​ను ఫ్యామిలీతో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు.

టీమిండియా పేస్ గన్ జస్​ప్రీత్ బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ క్రికెట్​తో అలసిపోయిన పేసుగుర్రం ఇప్పుడు ఖాళీ టైమ్​ను ఫ్యామిలీతో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఐపీఎల్​కు ముందు ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో పాల్గొన్నాడు బుమ్రా. ఆ తర్వాత క్యాష్ రిచ్ లీగ్​లో ముంబై ఇండియన్స్​కు ఆడాడు. అది ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్​తో బిజీ అయిపోయాడు. ఇలా దాదాపు మూడ్నెళ్లు విశ్రాంతి లేకుండా ఆడుతూ అలసిపోయాడు. అందుకే ప్లేయర్ మేనేజ్​మెంట్​లో భాగంగా అతడికి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్​లకు అతడ్ని ఎంపిక చేయలేదు. అయితే బంగ్లాదేశ్​తో సిరీస్​కు మాత్రం బుమ్రా అందుబాటులోకి వస్తాడు.

బుమ్రాను కాపాడుకోవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. అతడి బౌలింగ్ యాక్షన్ కారణంగా గాయాల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందుకే అతడి విషయంలో సెలెక్టివ్​గా ఉండాలని, ప్రధాన సిరీస్​లు, టోర్నమెంట్లకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా బుమ్రాపై వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా భావించింది. అన్ని ఫార్మాట్లలోనూ టాప్ బౌలర్, టీ20 వరల్డ్ కప్​లో ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచిన ప్లేయర్​పై వేటు వేయడం ఏంటని ఆశ్చర్యపోకండి. టెస్టుల్లో భారత్​కు వైస్ కెప్టెన్​గా ఉన్న బుమ్రాను ఆ పోస్ట్​ నుంచి తీసేసి.. యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు ఆ బాధ్యతలు ఇవ్వాలని బోర్డు భావిస్తోందని తెలిసింది.

ఆల్రెడీ వన్డేలు, టీ20లకు గిల్​ను వైస్ కెప్టెన్​ చేసింది బీసీసీఐ. ఇప్పుడు టెస్టుల్లో కూడా అతడికి అదే రెస్పాన్సిబిలిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. ప్రస్తుతం వైస్ కెప్టెన్​గా ఉన్న బుమ్రాను ఇక మీదట కేవలం బౌలర్​గానే బరిలోకి దించాలని డిసైడ్ అయిందట. సాధారణంగా టీమ్ మేనేజ్​మెంట్ మారినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పొట్టి ప్రపంచ కప్​లో వైస్ కెప్టెన్​గా ఉన్న హార్దిక్​ పాండ్యాను కాదని టీ20లకు సూర్యకుమార్​ను పర్మినెంట్ కెప్టెన్ చేయడం తెలిసిందే. బుమ్రా విషయంలో అదే జరగబోతోందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

శుబ్​మన్ గిల్​ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్​గా చూస్తున్న కొత్త కోచ్ గంభీర్.. అతడికే వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని గట్టిగా చెప్పడంతోనే బోర్డు ఛేంజ్ చేస్తోందని టాక్ నడుస్తోంది. హార్దిక్​లాగే బుమ్రా కూడా ఇంజ్యురీ ప్రోన్ ప్లేయర్. గాయం కారణంగా వైస్ కెప్టెన్ సిరీస్​లకు దూరమవడం టీమ్​కు మంచిది కాదనే ఉద్దేశంతోనే బుమ్రాపై వేటుకు బోర్డు రెడీ అవుతోందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఏదీ చెప్పలేం. ఈ వార్త తెలిసిన నెటిజన్స్ పేసు గుర్రానికి అన్యాయం చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు. గిల్​ లాంటి యంగ్​స్టర్ మీద భారం పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇంకా మూడు ఫార్మాట్లలోనూ సెటిల్ అవ్వని గిల్​ మీద అతి నమ్మకం పనికి రాదని సూచిస్తున్నారు. మరి.. బుమ్రాను తీసేసి గిల్​కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం సరైనదేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments