SNP
Mohammed Siraj, IND vs SL: శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌కు రెడీ అవుతున్న క్రమంలో.. స్టార్ పేసర్ సిరాజ్ అద్భుతం చేశాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Mohammed Siraj, IND vs SL: శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌కు రెడీ అవుతున్న క్రమంలో.. స్టార్ పేసర్ సిరాజ్ అద్భుతం చేశాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైపోయింది. నేడు(శనివారం) పల్లెకలె వేదికగా లంకతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్ కోసం శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌లో టీమిండియా క్రికెటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఆధ్వర్యంలో జరిగిన ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో అయితే చెలరేగిపోయారు. ఎప్పటి లాగే.. దిలీజ్ కొత్తగా పెట్టే ఛాలెంజెస్‌ను స్వీకరిస్తూ.. ఆటగాళ్లు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఈ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
ఆటగాళ్ల ఉత్సాహం చూసి.. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గౌతమ్ గంభీర్ సైతం చిరు నవ్వులు చిందించాడు. అంత ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది.. భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్. టీమిండియా కొత్త హెడ్ కోచ్ పర్యవేక్షణలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ క్రికెటర్లకు ఒక పోటీ పెట్టాడు. దూరంగా వికెట్, బాల్, బాటిల్ పెట్టి.. వాటికి త్రో వేయాలని సూచించాడు. మూడు టార్గెట్స్‌కు మూడు వేర్వేరు పాయింట్స్ కూడా పెట్టాడు. గిల్, బిష్ణోయ్, పంత్ టార్గెట్స్‌ను అద్భుతంగా హిట్ చేశారు. అలాగే లో యాంగిల్ క్యాచ్‌లు పడుతున్న సమయంలో స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అద్భుతమే చేశాడు.
సాధారణంగా స్పీడ్ బౌలర్లు అంత గొప్ప ఫీల్డర్లు కాదనే విమర్శ ఉంది. రన్నప్, బౌలింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టే పేసర్లు.. డైవ్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు, ఆసక్తి చూపించరు. కానీ, సిరాజ్ మాత్రం మంచి ఫీల్డర్ అని ఒప్పుకోవాల్సిందే. తాజాగా ఈ ప్రాక్టీస్‌లో కూడా ఓ సూపర్ డైవ్‌తో ఆటగాళ్ల ప్రశంసలతో పాటు కోచ్‌ల పొగడ్తలు కూడా అందుకున్నాడు. సిరాజ్ వేసిన డైవ్ చూసి.. శ్రీలంకతో మ్యాచ్ అనగానే సిరాజ్‌కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంకను సిరాజ్ కుప్పకూల్చిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి.. లంకకు నైట్‌మేయర్‌గా మారిపోయాడు సిరాజ్. అందుకే శ్రీలంక అనగానే.. భారత క్రికెట్ అభిమానులకు సిరాజ్ గుర్తుకు వస్తాడు. మరి ప్రాక్టీస్‌లో సిరాజ్ డైవ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hey you fielding drill – How so fun 😄😎
Quite a vibe in the group in this fun session at Kandy 🤙#TeamIndia | #SLvIND pic.twitter.com/nIaBOnM8Wy
— BCCI (@BCCI) July 26, 2024