iDreamPost
android-app
ios-app

Shubman Gill: క్రికెట్​లో వాళ్లే నాకు స్ఫూర్తి.. అలా ఆడటం అసాధ్యం: శుబ్​మన్ గిల్

  • Published Jul 06, 2024 | 4:09 PM Updated Updated Jul 06, 2024 | 4:09 PM

జింబాబ్వే టూర్​లో యంగ్ ఇండియాను లీడ్ చేస్తున్నాడు శుబ్​మన్ గిల్. కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపిస్తున్న ఈ యంగ్ బ్యాటర్.. క్రికెట్​లో తనకు వాళ్లే ఇన్​స్పిరేషన్ అంటున్నాడు.

జింబాబ్వే టూర్​లో యంగ్ ఇండియాను లీడ్ చేస్తున్నాడు శుబ్​మన్ గిల్. కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపిస్తున్న ఈ యంగ్ బ్యాటర్.. క్రికెట్​లో తనకు వాళ్లే ఇన్​స్పిరేషన్ అంటున్నాడు.

  • Published Jul 06, 2024 | 4:09 PMUpdated Jul 06, 2024 | 4:09 PM
Shubman Gill: క్రికెట్​లో వాళ్లే నాకు స్ఫూర్తి.. అలా ఆడటం అసాధ్యం: శుబ్​మన్ గిల్

జింబాబ్వే టూర్​లో యంగ్ ఇండియాను లీడ్ చేస్తున్నాడు శుబ్​మన్ గిల్. కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా నిలకడైన బ్యాటింగ్​తో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్​లో కీలక ప్లేయర్​గా ఎదిగాడు గిల్. అందుకే అతడికి ఈ సిరీస్​లో కెప్టెన్​గా అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు. గిల్ సారథ్యంలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ముఖేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, రియాన్ పరాగ్ తదితరులతో కూడిన జట్టు ఇవాళ జింబాబ్వేను ఎదుర్కోనుంది. తొలి టీ20కి హరారే మైదానం వేదిక కానుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మరో నాలుగు టీ20లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్​కు ముందు కెప్టెన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అభిషేక్ శర్మతో కలసి తాను ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తానని అన్నాడు.

అభిషేక్​తో కలసి తాను ఓపెనింగ్ చేస్తానన్న గిల్.. రుతురాజ్ కీలకమైన ఫస్ట్ డౌన్​లో బ్యాటింగ్​కు దిగుతాడని అన్నాడు. ఈ సందర్భంగా క్రికెట్​లో తనకు ఎవరు బాగా ఇష్టమో చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ప్లేయర్స్ అని తెలిపాడు. వాళ్లిద్దరూ తనకు రోల్ మోడల్స్ అని పేర్కొన్నాడు గిల్. ఆ ఇద్దరి ఇన్​స్పిరేషన్​తో కెరీర్​లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. రోహిత్-విరాట్ భారత్ క్రికెట్​కు మూలస్తంభాలని, వాళ్లిద్దరూ లెజెండ్స్ అని మెచ్చుకున్నాడు. టీ20 క్రికెట్​లో వాళ్లలా ఆడటం అసాధ్యమన్నాడు గిల్. వాళ్లలా బ్యాటింగ్​లో మ్యాజిక్ చేయడం ఇంపాజిబుల్ అన్నాడు. అయితే వాళ్లు చూపిన మార్గంలో నడుస్తానని వ్యాఖ్యానించాడు.

సీనియర్ల గైర్హాజరీలో టీమ్​పై ఉండే ప్రెజర్ మీద గిల్ రియాక్ట్ అయ్యాడు. భారత జట్టుపై అభిమానులు ఎల్లప్పుడూ భారీగా ఎక్స్​పెక్టేషన్స్ పెట్టుకుంటారని తెలిపాడు. అంచనాలతో పాటు టీమ్​పై ఒత్తిడి కూడా ఉంటుందన్నాడు. కానీ ఈ ప్రెజర్​ను చిత్తు చేయడం ఎలాగో రోహిత్, కోహ్లీ నేర్పించారని.. వాళ్లు చూపిన తోవలో నడుస్తూ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నిస్తానని గిల్ స్పష్టం చేశాడు. ప్రతి ప్లేయర్​కు తనకంటూ కొన్ని వ్యక్తిగత లక్ష్యాలు ఉంటాయని, అవే అతడిపై ఒత్తిడిని పెంచుతాయన్నాడు యంగ్ ఇండియా కెప్టెన్. రోహిత్, కోహ్లీ లాంటి లెజెండ్స్ సాధించిన ఘనతలు, విజయాలను అందుకునే క్రమంలో అనుకోకుండానే టీమ్​ మీద ప్రెజర్ పడుతుందన్నాడు గిల్. మరి.. రోహిత్-కోహ్లీ స్ఫూర్తిగా ముందుకెళ్తానంటూ శుబ్​మన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.