SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా మంచి స్థితిలో ఉన్నా.. ఒక రనౌట్ మాత్రం భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. పైగా ఆ రనౌట్‌కు మరో టీమిండియా ప్లేయర్ కారణంగా కావడం గమనార్హం. మరి ఆ రనౌట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా మంచి స్థితిలో ఉన్నా.. ఒక రనౌట్ మాత్రం భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. పైగా ఆ రనౌట్‌కు మరో టీమిండియా ప్లేయర్ కారణంగా కావడం గమనార్హం. మరి ఆ రనౌట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాను ఒక సమస్య వేధిస్తోంది. అదే మిస్ కమ్యూనికేషన్. తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఈ సమస్య కారణంగా.. తొలి మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ బలి అయ్యాడు. ఇప్పుడు తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ బలయ్యాడు. అది కూడా 91 పరుగులు వద్ద ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన గిల్.. అంతకు ముందు ఫామ్‌లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ఆ సెంచరీతో జట్టులో తన చోటు నిలుపుకున్నాడు. కానీ, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ డకౌట్ అయి.. మళ్లీ ఫామ్ పోయిందా అనిపించింది. కానీ, గిల్ ఆచితూచీ ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు.
కానీ, మూడో రోజు నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కుల్దీప్ యాదవ్.. నాలుగో రోజు కొద్ది సేపు బాగా బ్యాటింగ్ చేశాడు. కొన్ని మంచి షాట్లు కూడా ఆడాడు. ఈ క్రమంలోనే గిల్-కుల్దీప్ మధ్య మంచి భాగస్వామ్యం సైతం నమోదైంది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 64వ ఓవర్ చివరి బంతికి ముందుకొచ్చి మిడాన్ దిశగా సూపర్ షాట్ ఆడాడు. కానీ, అది ఒక స్లెప్ పడి కెప్టెన్ బెన్ స్టోక్స్ చేతుల్లో పడింది. అందులోనే కుల్దీప్-గిల్ మధ్య మిస్‌కమ్యూనికేషన్ చోటు చేసుకుంది. రన్ కోసం కాల్ ఇచ్చిన కుల్దీప్.. తర్వాత ఆగిపోయాడు. కుల్దీప్ కాల్ అందుకుని.. రన్ కోసం బాల్ చూసుకుంటూ ముందుకెళ్లాడు. కుల్దీప్ యాదవ్ నో చెప్పడంతో మళ్లీ తిరిగి వెనక్కి వచ్చాడు. ఈ లోపు బెన్ స్టోక్ బాల్ అందుకుని బౌలర్‌కు అందించడం, అతను స్టంప్స్‌ను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి.
91 పరుగుల వద్ద గిల్ రనౌట్ అయ్యాడు. నైట్ వాచ్ మ్యాచ్‌గా వచ్చిన కుల్దీప్ యాదవ్ చేసిన పొరపాటు కారణంగా గిల్ తన సెంచరీ మిస్ అయ్యాడు. చాలా నిరాశగా గిల్ పెవిలియన్ చేరాడు. అలా వెళ్తూ.. తన బ్యాట్‌ను కోపంగా గ్రౌండ్‌కేసి కొట్టాడు. మరోవైపు కుల్దీప్ సైతం తను చేసిన పొరపాటుకు చింతిస్తూ కనిపించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కుల్దీప్ కూడా అవుట్ అయ్యాడు. 91 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీకి చేరువుగా ఉన్న గిల్ కోసం కుల్దీప్ తన వికెట్ త్యాగం చేయాల్సిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 151 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 91 పరుగులు చేసిన గిల్.. దురదృష్టవశాత్తు రనౌట్ అయి.. తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరి ఈ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I love you Kuldeep Yadav 😍😘😘 pic.twitter.com/vQ3Sl54NaR
— 🚬 (@wagnumm) February 18, 2024