SNP
Shubman Gill, T20 World Cup 2024: ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్న శుబ్‌మన్ గిల్.. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటుపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Shubman Gill, T20 World Cup 2024: ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్న శుబ్‌మన్ గిల్.. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటుపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఒక వైపు ఐపీఎల్ 2024 సీజన్ జోరుగా సాగుతున్నా.. మరో వైపు రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024 గురించి భారీగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే టీమ్‌లో ఎవరికి ప్లేస్ ఉంటుంది, ఎవరికి ఉండదనే విషయంపై క్రికెట్ అభిమానులకు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమిండియా యువ క్రికెటర్, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్.. టీ20 క్రికెట్‌లో తనకు చోటు ఉంటుందా? ఉండదా అనే విషయంపై స్పందించాడు. ప్రస్తుతం చాలా ఊహాగానాలు వస్తున్నాయి.. గిల్ టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడా? ఉండడా? ఇలాంటి విషయాలు విన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావ్? అసలు నువ్వు ఏం అనుకుంటున్నావ్? టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కుతుందని అనుకుంటున్నావా? అని గిల్‌కు ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో 900 పరుగులు చేసిన తనకు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకుంటే ఏం చేస్తాను.. ఇంట్లో కూర్చోని మన టీమ్‌కు సపోర్ట్ చేస్తాను, వాళ్లను చీర్ చేస్తాను అన్నాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా గిల్ 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కూడా గిల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 38 యావరేజ్, 146.15 స్ట్రైక్‌రేట్‌తో 304 పరుగులు చేశాడు. అయితే.. టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్‌లో చోటుపై స్పందిస్తూ.. ఒక విధంగా గిల్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. టీమ్‌లోకి తనను తీసుకోవాల్సిందే అనే విధంగా గిల్ వ్యాఖ్యలు అర్థం చేసుకోవచ్చు.
గత ఐపీఎల్ 890 పరుగులు, ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 304 పరుగులు చేసిన తనను కాదని, ఇంకెవరిని తీసుకుంటారు? అని గిల్ ప్రశ్నించేలా వ్యాఖ్యానించాడు. ఒక వేళ తనకు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోయినా.. తనకు పోయేది ఏం లేదని, తన ఫేస్‌పై నవ్వు ఇలాగే ఉంటుందని అన్నాడు. అంటే.. తనను ఎంపిక చేయకుంటే.. తనకంటే టీమ్‌కే ఎక్కువ నష్టం అని గిల్ భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే.. గిల్ టీ20ల్లో బాగానే ఆడుతున్న అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు ఉన్నాయి. పైగా టాపార్డర్‌లో గిల్‌కు చోటు కష్టంగా మారింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- జైస్వాల్, వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, వీళ్లు గాయపడితే తప్ప.. వీరి ముగ్గురిని కాదన గిల్‌ను తీసుకోవడం కష్టమే. మరి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటుపై గిల్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill – “if I don’t get selected for the T20 World Cup team, I’ll cheer for India from home”.
– Gill, a gem of a person. ❤️pic.twitter.com/ogGWtPFrNJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024