SNP
Rohit Sharma, Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌లో అదరగొడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఐసీసీ ఊహించని షాకిచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2024 ముందు ఇది వారికి పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
Rohit Sharma, Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌లో అదరగొడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఐసీసీ ఊహించని షాకిచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2024 ముందు ఇది వారికి పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ మూడ్‌లో ఉన్నారు. కానీ, ఐపీఎల్ తర్వాత ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందన్న విషయం కూడా అందరికి తెలిసిందే. జూన్‌లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ మెగా టోర్నీ కోసం మొత్తం నాలుగు గ్రూపులుగా జట్లను విడగొట్టారు. ఇందులో క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి విషయం ఏంటంటే.. ఇండియా, పాకిస్థాన్ జట్లు రెండూ ఓకే గ్రూప్‌లో ఉన్నాయి. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు దొరకనుంది. ఈ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను ఐసీసీ విడుదల చేసింది.
అమెరికాలోని న్యూయార్క్‌లో గల నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పోస్టర్‌కు సంబంధించిన ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంది. ఐసీసీ విడుదల చేసిన పోస్ట్‌లో ఒక వైపు టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్, మరోవైపు పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా అఫ్రిదీ ఉన్నారు. ఇది చూసిన భారత క్రికెట్ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఫొటో కాకుండా శుబ్‌మన్ గిల్ ఫొటోను పోస్టర్‌పై పెట్టడాన్ని రోహిత్ శర్మ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. విరాట్ కోహ్లీ అభిమానులైతే.. ఇది కోహ్లీకి జరిగిన అవమానంగా భావిస్తున్నారు.
ఎందుకంటే.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే టాప్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇటీవల ఒక మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసిన తర్వాత.. కోహ్లీ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో తన పేరు క్రికెట్‌ను ప్రమోట్ చేయడానికి ఎక్కువ వాడుతున్నారని, బహుషా దానికి నేను అర్హుడినే అని నమ్ముతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. అలాగే టీ20 క్రికెట్‌కి కూడా తన పేరును వాడుతున్నారని కోహ్లీ తెలిపాడు. కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. ఐసీసీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ పోస్టర్‌పై గిల్ ఫొటోను ముద్రించింది. దీంతో.. ఇది కోహ్లీకి జరిగిన అవమానం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వరల్డ్ క్రికెట్‌కు ఫేస్‌గా ఉన్న కోహ్లీ కాకుండా అసలు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడో లేదో తెలియని గిల్ ఫొటో పోస్టర్‌పై ఉండటం చాలా మందికి నచ్చడం లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill featuring in India Vs Pakistan poster of ICC. 🔥 pic.twitter.com/oFk6HQfbr8
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024