రోహిత్ నిస్వార్ధం గిల్ కి అర్ధం అయ్యింది! ఓపెన్ గా చెప్పేశాడు!

  • Author Soma Sekhar Published - 02:52 PM, Sat - 18 November 23

రోహిత్ శర్మలో ఉన్న నిస్వార్థ గుణం టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అర్ధమైంది. అందుకే ఓపెన్ గా హిట్ మ్యాన్ గురించి చెప్పేశాడు. ఇందుకు వేదికగా మారింది ఓ వీడియో. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

రోహిత్ శర్మలో ఉన్న నిస్వార్థ గుణం టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అర్ధమైంది. అందుకే ఓపెన్ గా హిట్ మ్యాన్ గురించి చెప్పేశాడు. ఇందుకు వేదికగా మారింది ఓ వీడియో. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 02:52 PM, Sat - 18 November 23

వరుసగా 10 మ్యాచ్ ల్లో విజయాలు సాధించి.. వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకొచ్చింది టీమిండియా. టోర్నీ ఆరంభం నుంచి ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. జట్టుకు తిరుగులేని విజయాలను అందించారు. ఇక భారత జట్టును తన కెప్టెన్సీలో దూకుడుగా ముందుకుతీసుకెళ్తున్నాడు రోహిత్ శర్మ. పక్కా ప్రణాళికలతో ఒత్తిడికి లోనుకాకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ముందుకుసాగుతున్నాడు. ఒక్క కెప్టెన్ గానే కాకుండా బ్యాటింగ్ లో దుమ్మురేపుతూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అయితే కొందరు మాత్రం రోహిత్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. హిట్ మ్యాన్ తన స్వార్థం కోసం, వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా గతంలో కామెంట్స్ చేశారు. కానీ అతడిలో ఉన్న నిస్వార్థ గుణం టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అర్ధమైంది. అందుకే ఓపెన్ గా హిట్ మ్యాన్ గురించి చెప్పేశాడు. ఇందుకు వేదికగా మారింది ఓ వీడియో. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

రోహిత్ శర్మ.. ఓ నాయకుడిగా, ఓ బ్యాటర్ గా దిగ్విజయంగా టీమ్ ను ముందుకు నడుపుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో దుమ్మురేపుతూ.. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో టాప్ ఫైవ్ లో ఉన్నాడు. ఓ వైపు జట్టును, మరోవైపు బ్యాటింగ్ ను సమన్వయం చేయడం అంటే కత్తిమీదసామనే చెప్పాలి. ఈ రెండు పనులను హిట్ మ్యాన్ ఎంతో అద్భుతంగా నెరవేరుస్తున్నాడు. కాగా.. వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఆసీస్ తో తలపడేందుకు సిద్దమవుతోంది టీమిండియా. ఇందుకోసం భారత ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మకు సంబంధించిన ఓ మీమ్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. అందులో ఏముందంటే? ఓ సింహానికి ఓ వ్యక్తి మాంసాన్ని వేస్తున్నాడు. ఈ వీడియోను ఓ ఫ్యాన్ రోహిత్ నిస్వార్దాన్ని పోల్చుతూ ఎడిట్ చేశాడు. మాంసాన్ని రికార్డులుగా చూపించి.. ఆ సింహానికి విసరగా తనకు తనకు అవి అవసరం లేదని విసిరే వ్యక్తే(వరల్డ్ కప్ గా పోల్చాడు) తనకు కావాలని అక్కడే ఉంది ఆ సింహం. ఇక్కడ సింహాన్ని రోహిత్ తో పోల్చాడు సదరు ఫ్యాన్. ఓవరాల్ గా ఈ వీడియో ద్వారా చెప్పదలచుకున్నది ఏంటంటే? రోహిత్ శర్మకు వ్యక్తిత రికార్డులు అవసరం లేదని, వరల్డ్ కప్పే తన ధ్యేయమని.

ఇక ఈ వీడియోకి లైక్ కొట్టాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్. రోహిత్ నిస్వార్ధపరుడు అని ఒకే ఒక్క లైక్ ద్వారా ఓపెన్ గా చెప్పేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు గిల్ దృష్టిలో రోహిత్ శర్మ హీరో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం హిట్ మ్యాన్ వ్యక్తిత్వం ఏంటో, మైండ్ సెట్ ఏంటో ఒక్క వీడియోలో చెప్పేశారని రాసుకొస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments