మరికొన్ని గంటల్లో క్రికెట్ విశ్వ సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రీడా పండితులు, క్రికెట్ దిగ్గజాలు వరల్డ్ కప్ జట్లపై అలాగే ఆటగాళ్లపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ ముఖ్యమైన ప్రశ్న ఎదురైంది. అదేంటంటే? ఈసారి వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచేదెవరని. ఈ ప్రశ్నకు ఎక్కువ మంది దిగ్గజాలు టీమిండియా బ్యాటర్ నే ఎన్నుకున్నారు. టీమిండియా బ్యాటర్ అనగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనుకుంటే మీరు పొరబడినట్లే. మరి ఇంతకీ లెజెండ్స్ చెబుతున్న ఆ వరల్డ్ కప్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ 2023లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. చాలా మంది క్రీడా విశ్లేషకులు, క్రికెట్ దిగ్గజాలు ఈ మెగాటోర్నీలో ఎవరు టాప్ స్కోరర్ గా నిలుస్తారన్న విషయంలో తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఓ టీమిండియా యంగ్ బ్యాటర్ పేరును సూచించారు. బాబర్ అజం, విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాళ్లను కాదని ఎక్కువ మంది లెజెండ్స్ టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ పేరును సూచించారు.
ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ పర్ట్స్ పేరిట నిర్వహించిన ఇంటర్వ్యూల్లో వీరు తమ అభిప్రాయాలను తెలియపరిచారు. ఇక ఎవరెవరు ఏ ఆటగాడి పేరు చెప్పారో ఇప్పుడు చూద్దాం. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డు ప్లెసిస్ తన చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ టీమిండియా యంగ్ ప్లేయర్ గిల్ పేరును సూచించాడు. గిల్ పేరును సూచించిన వారిలో టీమిండియా వుమెన్స్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పియూష్ చావ్లాతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు గిల్ పేరునే ఉద్ఘాటించారు.
కాగా.. సౌతాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ పాక్ కెప్టెన్ బాబర్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడని పేర్కొన్నాడు. గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ పేరును, ఇర్ఫాన్ పఠాన్ విరాట్ పేరును సూచించారు. అయితే గత కొంతకాలంగా శుబ్ మన్ గిల్ అద్భుత ప్రదర్శతో ఆకట్టుకుంటున్నాడు. 2023లో గిల్ 19 వన్డే మ్యాచ్ లు ఆడి 1220 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలతో పాటుగా 5 అర్దశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 208గా నమోదు చేసుకున్నాడు గిల్. మరి ఈ వరల్డ్ కప్ లో ఎవరు అత్యధిక పరుగులు చేస్తారో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gill will top run-scorer in the CWC 2023 pic.twitter.com/shiR1TSsq2
— sunil kumar (@naidusunilkumar) October 4, 2023