Amit Mishra: రోహిత్ వారసుడు అతడు కాదు.. కెప్టెన్​గా పనికిరాడు: అమిత్ మిశ్రా

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి కూడా అతడు తప్పుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో హిట్​మ్యాన్ వారసుడి కోసం వెతుకులాట మొదలైంది.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి కూడా అతడు తప్పుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో హిట్​మ్యాన్ వారసుడి కోసం వెతుకులాట మొదలైంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్​ ఫైనల్​తో ఆ ఫార్మాట్​ నుంచి అతడు తప్పుకున్నాడు. అయితే వన్డేలు, టెస్టుల్లో మాత్రం కంటిన్యూ అవుతానని ప్రకటించాడు. కానీ వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్​ నుంచి కూడా అతడు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 37 ఏళ్ల రోహిత్ కెరీర్​ను మరింత కాలం పొడిగించుకోవాలంటే ఇంకో ఫార్మాట్​కు గుడ్​బై చెప్పక తప్పదని అంటున్నారు. దీంతో కెప్టెన్సీలో హిట్​మ్యాన్ వారసుడి కోసం వెతుకులాట మొదలైంది. హార్దిక్ పాండ్యా, శుబ్​మన్ గిల్, కేఎల్ రాహుల్ రూపంలో పలు ఆప్షన్లు భారత క్రికెట్ బోర్డు ముందు ఉన్నాయి.

టీ20 ప్రపంచ కప్​లో హార్దిక్ పాండ్యా టీమిండియాకు వైస్ కెప్టెన్​గా వ్యవహరించాడు. మెగాటోర్నీ ముగిశాక జరిగిన జింబాబ్వే సిరీస్​లో శుబ్​మన్ గిల్ జట్టుకు సారథిగా ఉన్నాడు. త్వరలో జరిగే శ్రీలంక సిరీస్​లో రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు తీసుకునే అవకాశం ఉందని వినిపిస్తోంది. వీళ్లందరిలో తక్కువ వయసు ఆటగాడైన గిల్ బ్యాట్​తో రాణిస్తుండటం, అతడి కెప్టెన్సీలో జట్టు సిరీస్​ను గెలుచుకోవడం, మంచి కంపోజర్​తో కనిపించే ప్లేయర్ కావడంతో అతడ్నే రోహిత్ వారసుడిగా పలువురు సీనియర్లు అంచనా వేస్తున్నారు. అయితే భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం గిల్ కెప్టెన్​గా పనికిరాడని అన్నాడు. అతడు రోహిత్ వారసుడు కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘శుబ్​మన్ గిల్ కెప్టెన్సీకి పనికిరాడు. భారత జట్టులో ఉన్నంత మాత్రాన అతడ్ని సారథిని చేసేస్తారా? గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్​లో గిల్ రాణించిన మాట వాస్తవమే. టీమిండియా తరఫున కూడా అతడు నిలకడగా పరుగులు చేస్తున్నాడు. కెప్టెన్సీలో కూడా ఎక్స్​పీరియెన్స్ రావాలనే ఉద్దేశంతో అతడ్ని సారథిని చేసినట్లు కనిపిస్తోంది. కానీ అతడ్ని ఐపీఎల్​లో దగ్గరగా చూశా. కెప్టెన్సీ గురించి అతడికి అస్సలు ఐడియా లేదు. అతడ్ని ఎందుకు సారథిని చేశారో అర్థం కావడం లేదు’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో కెప్టెన్సీకి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. జింబాబ్వే సిరీస్​లో ఆడిన రుతురాజ్, సంజూల్లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదని వివరించాడు. మరి.. గిల్ కెప్టెన్​గా వేస్ట్ అంటూ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments