iDreamPost
android-app
ios-app

అతను టీమ్‌లో లేకుంటే.. అది ఏలియన్స్‌ టీమ్‌ అవుతుంది: హర్షా భోగ్లే

  • Published Jul 16, 2024 | 1:25 PM Updated Updated Jul 16, 2024 | 1:25 PM

Ruturaj Gaikwad, Harsha Bhogle: ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే తాజాగా ఓ యంగ్‌ క్రికెటర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో నెక్ట్స్‌ సూపర్‌ అతనే అంటూ పేర్కొన్నాడు. మరి ఆ నెక్ట్స్‌ సూపర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ruturaj Gaikwad, Harsha Bhogle: ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే తాజాగా ఓ యంగ్‌ క్రికెటర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో నెక్ట్స్‌ సూపర్‌ అతనే అంటూ పేర్కొన్నాడు. మరి ఆ నెక్ట్స్‌ సూపర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 16, 2024 | 1:25 PMUpdated Jul 16, 2024 | 1:25 PM
అతను టీమ్‌లో లేకుంటే.. అది ఏలియన్స్‌ టీమ్‌ అవుతుంది: హర్షా భోగ్లే

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. భారత క్రికెట్‌కు రెండు కళ్లలాంటి ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో వీరి తర్వాత టీమిండియాను నడిపించే వాళ్లు ఎవరనే చర్చ క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. అయితే.. క్రికెట్‌ అభిమానులకు కాస్త క్లారిటీ ఇస్తూ.. ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే టీమిండియాలో నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌ అతనే అంటూ ఓ యంగ్‌ క్రికెటర్‌ పేరు వెల్లడించాడు. మరి భారత క్రికెట్‌కు కాబోయే సూపర్‌ స్టార్‌ ఎవరు? భోగ్లే ఎందుకంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..

తాజాగా యంగ్‌ టీమిండియా జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడింది. ఈ జట్టుకు శుబ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది షాక్‌ అయ్యారు. చాలా మంది రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో టీమిండియా జింబాబ్వే టూర్‌కు వెళ్తుందని భావించారు. పైగా గతంలో టీమిండియాను క్వామన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుతంగా నడిపించాడు గైక్వాడ్‌. కానీ, బీసీసీఐ గిల్‌ను కెప్టెన్‌ని చేసింది. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే.. సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన రుతురాజ్‌ను చివరి మ్యాచ్‌లో పక్కపెట్టారు. ఎంతో అద్భుతంగా ఆడుతున్నా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ను పక్కనపెడితే.. ఆ టీమ్‌ వేరే ప్లానెట్‌ నుంచి వచ్చినట్లే అంటూ హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు.

ఇండియన్‌ క్రికెట్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హర్షా భోగ్లే కామెంట్స్‌తో చాలా మంది ఏకీభవిస్తున్నారు. అద్భుతమైన టాలెంట్‌తో పాటు, లాంగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా, ఒత్తిడిని తట్టుకుంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించడంతో పాటు.. టీమ్ పరిస్థితిని బట్టి నిదానంగా, వేగంగా ఎలాగైన బ్యాటింగ్‌ చేయగల క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సరైన అవకాశాలు దక్కి ఉంటే గైక్వాడ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ 2023, టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆడి ఉండేవాడని అంటున్నారు. పైగా కెప్టెన్సీ లక్షణాలు కూడా గైక్వాడ్‌లో పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. మరి రుతురాజ​ గైక్వాడ్‌ టీమిండియాలో నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌ అంటూ హర్షా భోగ్లే పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.