వీడియో: సైనీ స్టన్నింగ్ డెలివరీకి గిల్ క్లీన్​బౌల్డ్.. ఇది చూసి తీరాల్సిన బాల్!

Shubman Gill, Navdeep Saini, Duleep Trophy 2024: టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ దేశవాళీ క్రికెట్​లో ఫెయిల్ అయ్యాడు. ఇండియా బీతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్​లో ఈ స్టార్ బ్యాటర్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Shubman Gill, Navdeep Saini, Duleep Trophy 2024: టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ దేశవాళీ క్రికెట్​లో ఫెయిల్ అయ్యాడు. ఇండియా బీతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్​లో ఈ స్టార్ బ్యాటర్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ బ్యాట్​తో చేసే వీరవిహారం గురించి తెలిసిందే. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుంటాడు. అవతల ఉన్నది ఎంత తోపు బౌలర్ అనేది చూడకుండా భారీ షాట్లు బాదుతుంటాడు. క్రీజులో సెటిల్ అయ్యే వరకు స్ట్రైక్ రొటేషన్​కు ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ యంగ్ బ్యాటర్.. ఆ తర్వాత జూలు విదిల్చి బాదుడు మొదలుపెడతాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్​లో ఒక రేంజ్​లో ఆడే గిల్.. దేశవాళీ క్రికెట్​లో ఫెయిల్ అయ్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన గిల్.. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్​లో విఫలమయ్యాడు. సీనియర్ పేసర్ నవ్​దీప్ సైనీ బౌలింగ్​లో అతడు క్లీన్​బౌల్డ్ అయ్యాడు. ఈ బాల్​ను చూసి తీరాల్సిందే. అంత అద్భుతంగా వేశాడు సైనీ. అయితే దీన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే గిల్ ఔట్ అయ్యాడు.

ఇండియా ఏ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసేందుకు వచ్చాడు నవ్​దీప్ సైనీ. అంతకుముందు బ్యాటింగ్ టైమ్​లో 144 బంతుల్లో 56 పరుగులు చేశాడీ సీనియర్ ప్లేయర్. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్​తో కలసి ఎనిమిదో వికెట్​కు ఏకంగా 203 పరుగులు జోడించాడు. మంచి ఇన్నింగ్స్ ఆడటంతో అదే జోష్​ను బౌలింగ్​లోనూ కంటిన్యూ చేశాడు సైనీ. స్టన్నింగ్ డెలివరీతో గిల్​ను క్లీన్​బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్ ఆఖరి బంతికి గిల్​ను పెవిలియన్​కు పంపించాడు. అంతకుముందు బాల్​ను బౌండరీకి తరలించిన శుబ్​మన్.. ఆఖరి బంతికి దొరికిపోయాడు. ఆఫ్ సైడ్ పడిన బంతి వికెట్ల మీదకు దూసుకొచ్చింది. స్వింగ్ అయి లోపలకు వస్తున్న బంతిని డిఫెన్స్ చేయాలా? వద్దా? అనే మీమాంసలో అలాగే ఉండిపోయాడు గిల్. బ్యాట్ అడ్డు పెట్టకపోవడం, ప్యాడ్స్​కు పక్క నుంచి గ్యాప్​లో వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది.

బంతి ఆ స్థాయిలో స్వింగ్ అవుతుందని ఊహించని గిల్.. అసలు ఎలా ఔట్ అయ్యానా? అని షాకయ్యాడు. ఎక్కడో ఆఫ్ స్టంప్​కు దూరంగా పడిన బంతి యాంగిల్ క్రియేట్ చేసుకొని లోపలకు రావడంతో అతడు దాన్ని సమర్థంగా ఫేస్ చేయలేకపోయాడు. కనీసం బ్యాట్​ను అడ్డుపెట్టినా బతికిపోయేవాడు. ప్యాడ్స్​తో కూడా దాన్ని ఆపలేక వికెట్ సమర్పించుకున్నాడు. ఇన్​స్వింగర్లను ఎదుర్కోవడంలో తనకు ఉన్న బలహీనతను అతడు మరోమారు బయటపెట్టాడు. అప్పటికి 42 బంతుల్లో 25 పరుగులు చేసిన గిల్.. భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని చేజేతులా కోల్పోయాడు. టెస్టుల్లో తప్పక రాణిస్తానని ఇటీవల చెప్పిన అతడు దాన్ని చేసి చూపించడంలో ఫెయిల్‌ అయ్యాడు. ఇక, ఇండియా ఏ ఇన్నింగ్స్​లో గిల్​తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (36) కూడా ఔట్ అయ్యాడు. అతడ్ని కూడా నవ్​దీప్ సైనీనే పెవిలియన్​కు పంపించాడు. ఆ టీమ్ ప్రస్తుతం 2 వికెట్లకు 96 పరుగులతో ఉంది. మరి.. గిల్ ఫెయిల్యూర్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments