iDreamPost
android-app
ios-app

పొట్ట తగ్గించి ఫిట్​గా మారిన రోహిత్.. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉందంటున్న ఓజా!

  • Published Sep 05, 2024 | 9:44 PM Updated Updated Sep 05, 2024 | 9:44 PM

Rohit Sharma, Pragyan Ojha, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇతర ప్లేయర్లలా వెకేషన్స్​లో గడిపేయకుండా ఫిట్​నెస్​పై అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్​మ్యాన్ బడా ప్లాన్ వేస్తున్నాడని అన్నాడు.

Rohit Sharma, Pragyan Ojha, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇతర ప్లేయర్లలా వెకేషన్స్​లో గడిపేయకుండా ఫిట్​నెస్​పై అతడు ఫోకస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్​మ్యాన్ బడా ప్లాన్ వేస్తున్నాడని అన్నాడు.

  • Published Sep 05, 2024 | 9:44 PMUpdated Sep 05, 2024 | 9:44 PM
పొట్ట తగ్గించి ఫిట్​గా మారిన రోహిత్.. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉందంటున్న ఓజా!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్​కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో ఫ్యామిలితో కలసి ఇంట్లోనే గడుపుతున్నాడు. అలాగని అతడు ఖాళీగా ఉండటం లేదు. ఇతర ప్లేయర్లలా వెకేషన్స్​లో గడిపేయకుండా ఫిట్​నెస్​పై హిట్​మ్యాన్ ఫోకస్ చేస్తున్నాడు. షూస్ వేసుకొని రోహిత్ రన్నింగ్ చేస్తున్న ఫొటోలు, అలాగే ట్రెయింగ్ చేస్తున్న వీడియోలు రీసెంట్​గా సోషల్ మీడియాలో హల్​చల్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన ఇంకొన్ని ఫొటోల్లో అతడ్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. బొద్దుగా, ముద్దుగా ఉండే టీమిండియా కెప్టెన్ ఆ ఫొటోల్లో పొట్ట తగ్గించి ఫిట్​గా కనిపించాడు. దీంతో సడన్​గా హిట్​మ్యాన్ ఎందుకు బరువు తగ్గాడని అంతా డిస్కస్ చేస్తున్నారు. దీని మీద భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా రియాక్ట్ అయ్యాడు. రోహిత్​ ఫిట్​గా మారడం వెనుక బడా ప్లాన్ ఉందన్నాడు. అది తెలిస్తే అంతా షాక్ అవుతారని చెప్పాడు.

రోహిత్ తన కెరీర్​ను మరింత కాలం పొడిగించుకోవడంపై ఫోకస్ చేశాడని.. ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలు అతడికి లేవన్నాడు ఓజా. ఎక్కువ కాలం గేమ్​లో కంటిన్యూ అవ్వాలంటే ఫిట్​గా ఉండటం చాలా ముఖ్యమనే విషయం అతడు గుర్తించాడని.. అందుకే బంగ్లాదేశ్ సిరీస్​కు ముందు దొరికిన గ్యాప్​ను ఫిట్​గా మారడానికి యూజ్ చేసుకుంటున్నాడని చెప్పాడు ఓజా. ‘రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు నేను కూడా చూశా. తన కెరీర్​ను పొడిగించుకోవాలంటే ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అన్నింటి కంటే ఫిట్​నెస్​ చాలా ముఖ్యమనే విషయాన్ని రోహిత్ అర్థం చేసుకున్నాడు. అందుకే దొరికిన ఈ 48 రోజుల గ్యాప్​ను అతడు ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకోవడం కోసం వాడుకుంటున్నాడు. బాగా ట్రెయిన్ అయి ఫిట్​గా, రెడీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని ఓజా చెప్పుకొచ్చాడు. ఓ స్పోర్ట్స్ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్​కు టీమిండియా అంటే చాలా ఇష్టమని.. జట్టులోని ఆటగాళ్లను అతడు ఫ్యామిలీలా చూసుకుంటాడని తెలిపాడు ఓజా. ప్రతి ప్లేయర్ విషయంలో కేర్‌‌ తీసుకుంటాడన్నాడు. అతడు అందరితో అలా ఉంటాడు కాబట్టే టీమ్ మొత్తం అతడ్ని నమ్ముతోందని, ఆ నమ్మకమే అద్భుతాలు చేసి చూపిస్తోందన్నాడు ఓజా. ఇక, ఇప్పటికే టీ20లకు గుడ్​బై చెప్పిన హిట్​మ్యాన్.. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి కూడా తప్పుకునే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అయితే లాంగ్ ఫార్మాట్​లో మాత్రం వచ్చే కొన్నేళ్ల పాటు అతడు కంటిన్యూ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఓజా చేసిన వ్యాఖ్యలతో వన్డేలు, టెస్టుల్లో వచ్చే కొన్నేళ్ల పాటు హిట్​మ్యాన్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే టీమిండియాకు చాలా మంచిది. జూనియర్లు టీమ్​లో సెటిల్ అయ్యే వరకు హిట్​మ్యాన్, కోహ్లీ లాంటి సీనియర్లు ఉండటం జట్టుకు ఎంతో అవసరమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.