Nidhan
టీమిండియా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. మెన్ ఇన్ బ్లూ బ్యాక్ టు బ్యాక్ సిరీస్ విక్టరీస్‌తో ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ నుంచి మొదలైన గెలుపు పరంపర ఇంకా కొనసాగుతోంది.
టీమిండియా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. మెన్ ఇన్ బ్లూ బ్యాక్ టు బ్యాక్ సిరీస్ విక్టరీస్‌తో ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ నుంచి మొదలైన గెలుపు పరంపర ఇంకా కొనసాగుతోంది.
Nidhan
టీమిండియా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ సిరీస్ విక్టరీస్పై ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ నుంచి మొదలైన గెలుపు పరంపర ఇంకా కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న తాజా టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను పట్టేసింది. వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు లంకను మట్టికరిపించి మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఆల్రెడీ గెలిచారు కాబట్టి ఆఖరి టీ20 నామమాత్రం కానుంది. దీంతో అందరూ ఫోకస్‌ను క్రమంగా వన్డే సిరీస్ మీదకు షిఫ్ట్ చేస్తున్నారు. ఆ సిరీస్‌లో యంగ్‌స్టర్స్‌లో ఎవరెవర్ని టీమ్‌లోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
భారత క్రికెట్లో ఇప్పుడు అంతా బాగానే ఉన్నా లంక సిరీస్‌లో కొందరు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో భారత టీ20 జట్టులో కీలకంగా ఉంటూ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌ను స్క్వాడ్‌లో తీసుకోలేదు. జింబాబ్వే సిరీస్‌లో పరుగుల వరద పారించినా అతడ్ని సెలెక్టర్లు కరుణించలేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, టీమ్‌లో అన్ని ప్లేసెస్ భర్తీ అయిపోవడంతో గైక్వాడ్ రీఎంట్రీ ఇవ్వడం కష్టమేననే కామెంట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు ఓపెనింగ్ ప్లేస్ కోసం గిల్- గైక్వాడ్ మధ్య పోటీ నెలకొంది. అయితే శుబ్‌మన్‌ను వైస్ కెప్టెన్ చేయడంతో అన్ని ఫార్మాట్లలో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోయింది. మరోవైపు పరుగులు చేస్తున్నా గైక్వాడ్‌కు మాత్రం చోటు దక్కడం లేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గిల్ కోసం రుతురాజ్‌కు అన్యాయం చేయొద్దన్నాడు.
‘శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్.. ఇద్దరూ సూపర్బ్ బ్యాటర్స్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే గిల్‌తో కంపేర్ చేస్తే రుతురాజ్ కన్సిస్టెంట్ ప్లేయర్ అనే చెప్పాలి. అతడు నిలకడగా పరుగులు చేస్తుంటాడు. అలాగని గిల్‌ను తీసిపారేయడం లేదు. అతడు స్ట్రైక్ రొటేషన్ చేస్తూనే అవసరమైనప్పుడు పవర్ హిట్టింగ్‌కు దిగుతాడు. వీళ్లిద్దరూ భారత టీమ్‌లో ఉండాల్సిందే’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. ఒక్కర్నే ఆడించడం కరెక్ట్ కాదని.. ఇద్దర్నీ జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. గైక్వాడ్ టాలెంట్‌ను వృథా చేయొద్దని.. అతడికి ఛాన్సులు ఇవ్వాలని అంటున్నారు. మరి.. రుతురాజ్‌ను టీమ్‌లోకి తీసుకోవాలనే డిమాండ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Robin Uthappa “Both Ruturaj and Shubman Gill are terrific batters.While Ruturaj may be slightly more consistent statistically,Shubman Gill offers valuable versatility,blending touch nd power in his game.India should field them both,Its tough to chose one”pic.twitter.com/WDCSp2YSFZ
— Sujeet Suman (@sujeetsuman1991) July 29, 2024