Rohit Sharma Tension For Hardik Pandya Return: రోహిత్ శర్మకు కొత్త తలనొప్పి.. ఎలా పరిష్కరిస్తాడో?

రోహిత్ శర్మకు కొత్త తలనొప్పి.. ఎలా పరిష్కరిస్తాడో?

  • Author singhj Published - 09:35 AM, Sat - 4 November 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సెమీస్​కు ముందు ఒక కొత్త సమస్య వేధిస్తోంది. దీన్ని అతడు ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సెమీస్​కు ముందు ఒక కొత్త సమస్య వేధిస్తోంది. దీన్ని అతడు ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

  • Author singhj Published - 09:35 AM, Sat - 4 November 23

వన్డే వరల్డ్ కప్-2023లో ఫేవరెట్స్ నుంచి హాట్ ఫేవరెట్స్​గా మారిపోయింది టీమిండియా. ఇప్పటిదాకా ఆడిన ఏడుకు ఏడు మ్యాచుల్లోనూ గెలిచింది. ఇక మిగిలింది రెండు మ్యాచులే. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్​ను అఫీషియల్​గా సాధించింది కాబట్టి ఆ రెండు మ్యాచుల్లో గెలుపోటములతో పెద్దగా సంబంధం ఉండదు. ఈ మ్యాచుల రిజల్ట్ ఎఫెక్ట్ సెమీస్ బెర్త్​పై పడదు. కాబట్టి భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏడు మ్యాచులు ఆడినందున విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ల ప్లేస్​లో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్​ లేదా పిచ్​ను బట్టి రవిచంద్రన్ అశ్విన్​ను ఆడించే అవకాశం ఉంది. కానీ విన్నింగ్ ఫ్రీక్​ను మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంతో అదే టీమ్​ను కంటిన్యూ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మెగాటోర్నీలో ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచుల్లో భారత బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించింది. పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అదరగొట్టారు. వాళ్ల ఫామ్​ను చెడగొట్టొద్దనే ఉద్దేశంతో సేమ్ టీమ్​ను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్​లోనూ అందరూ భీకర ఫామ్​లో ఉన్నారు. ఆందోళన రేపిన శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్​లు కూడా లంకతో మ్యాచ్​తో సత్తా చాటారు. సో, టీమ్​లో ఎవరి ప్లేస్​ను కూడా టచ్ చేయలేని పరిస్థితి. కానీ గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా గనుక కమ్​బ్యాక్ ఇస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు.

ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న పాండ్యా దాదాపుగా కోలుకున్నాడని సమాచారం. సౌతాఫ్రికాతో లేదా నెదర్లాండ్స్​తో ఆఖరి మ్యాచ్​కల్లా టీమ్​తో హార్దిక్ పాండ్యా చేరే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై టీమిండియా మేనేజ్​మెంట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే పాండ్యా రాక ఇప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తలనొప్పిగా మారింది. సూర్యకుమార్​ను తీసేసి పాండ్యాను తీసుకుందామా అంటే స్కై భీకర ఫామ్​లో ఉన్నాడు. ఇంగ్లండ్​తో మ్యాచ్​లో కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి 49 రన్స్ చేశాడు. బౌలింగ్​లో సిరాజ్, షమీల్లో ఎవర్నీ పక్కనపెట్టలేరు. జడేజా బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ అదరగొడుతున్నాడు.

ఫామ్​లో లేరనుకున్న శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్​ సూపర్ రిథమ్​లోకి వచ్చేశారు. దీంతో పాండ్యా కోసం ఎవర్ని తీసేయాలో తెలియక హిట్​మ్యాన్ తలపట్టుకుంటున్నాడని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. ఈ సమస్యను రోహిత్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలని చెబుతున్నారు. అయితే భారత ఫ్యాన్స్ మాత్రం టీమ్​లో ఒక ప్లేస్ కోసం ఇంత పోటీ ఉండటం చాలా మంచిదని.. మన బెంచ్ స్ట్రెంగ్త్ ఏంటనేది దీంతో తెలిసిపోతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్ ఎదుర్కొంటున్న కొత్త సమస్యకు పరిష్కారం తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ మ్యాచ్​కు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశాడుగా!

Show comments