iDreamPost
android-app
ios-app

ఇంగ్లాండ్ పై ఘన విజయం! టీమిండియాకు భారంగా మారిన యువ క్రికెటర్!

  • Author Soma Sekhar Updated - 12:53 PM, Mon - 30 October 23

వరల్డ్ కప్ లో ఓ ఆటగాడు మాత్రం తనకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా గానీ.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 134 పరుగులు మాత్రమే చేసి.. జట్టులో అవసరమా? అనే స్థాయికి వచ్చాడు. మరి జట్టుకు భారంగా మారిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో ఓ ఆటగాడు మాత్రం తనకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా గానీ.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 134 పరుగులు మాత్రమే చేసి.. జట్టులో అవసరమా? అనే స్థాయికి వచ్చాడు. మరి జట్టుకు భారంగా మారిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 12:53 PM, Mon - 30 October 23
ఇంగ్లాండ్ పై ఘన విజయం! టీమిండియాకు భారంగా మారిన యువ క్రికెటర్!

వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకెళ్తోంది. వరుసగా 6 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి.. సెమీస్ బెర్త్ ఖరారుచేసుకుంది. తాజాగా లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ ప్రపంచ కప్ లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో ప్లేయర్లు సమష్టిగా రాణించారు. కానీ ఓ ఆటగాడు మాత్రం తనకు ఎన్ని అవకాశాలు వస్తున్నా గానీ.. సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. వరల్డ్ కప్ లో 6 మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 134 పరుగులు మాత్రమే చేసి.. జట్టులో అవసరమా? అనే స్థాయికి వచ్చాడు. ప్రపంచ కప్ లాంటి మెగాటోర్నీల్లో ప్రతీ ఒక్క ఆటగాడు జట్టుకు ఉపయోగపడాలే గానీ.. భారంగా మారకూడదు. మరి ప్రస్తుతం టీమిండియాకు భారంగా మారిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ ఆడాలని, టైటిల్ సాధించాలని క్రికెట్ ఆడే ప్రతీ ఒక్క ప్లేయర్ కల. ఇక ఒక్కసారి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం వస్తే చాలు.. అనుకునే ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి క్రమంలో తమకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ లను మిస్ చేసుకుంటూ.. దారుణంగా విఫలం అవుతున్నారు కొందరు ప్లేయర్లు. ఇలాంటి ఆటగాడే ప్రస్తుతం టీమిండియాలో ఉన్నాడు. అతడే శ్రేయస్ అయ్యర్. వరల్డ్ కప్ కు ముందు అద్భుత ఫామ్ ను కనబరిచి.. ఆ తర్వాత గాయంతో కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే అతడిపై నమ్మకం ఉంచిన యాజమాన్యం శ్రేయస్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది. కానీ మేనేజ్ మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు అయ్యర్.

ప్రపంచ కప్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లో కేవలం 134 పరుగులే చేసి.. జట్టులో అతడు అవసరమా? అనే స్థాయికి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. కేవలం ఒకే ఒక అర్దశతకం నమోదు చేశాడు ఈ టోర్నీలో. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ 16 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరి.. తన పూర్ ఫామ్ ను కొనసాగించాడు. కాగా వరల్డ్ కప్ లో అతడు వరుసగా.. 0, 25, 53, 19, 33 రన్స్ చేశాడు. ఈ గణాంకాలు చూస్తేనే అతడు ఏ స్థాయిలో విఫలం అవుతూ వస్తున్నాడో అర్ధమవుతోంది. అయ్యర్ కు వరసగా అవకాశాలు ఇస్తున్నాగానీ.. వాటిని సద్వినియోగం చేసుకోలేపోతున్నాడు.

కాగా.. ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లు టీమిండియాలోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అయ్యర్ ఫామ్ జట్టులో అతడి స్థానానికే ముప్పుతెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ ఫామ్ చూస్తున్న ఇండియన్ ఫ్యాన్స్.. అతడు జట్టులో అవసరమా? అతడిని పక్కన పెట్టి మరో యంగ్ ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన శ్రేయస్ మునుపటి ఫామ్ ను అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ కప్ లో రాబోయే మ్యాచ్ ల్లో అయినా అతడు రాణించాలని కోరుకుంటున్నారు అభిమానులు. మరి వరల్డ్ కప్ లో శ్రేయస్ అయ్యర్ ఫామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.