SNP
టీమిండియాలో టాలెంటెడ్ యువ క్రికెటర్లకు కొదవ లేదు. కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి యువ స్టార్ బ్యాటర్ ఓ విక్‌నెస్‌తో ఇబ్బంది పడుతున్నాడు. కానీ, దానిపైనే పాఠాలు చెబుతూ ప్రస్తుతం నవ్వుల పాలవుతున్నాడు. మరి అయ్యర్‌పై ఎందుకు ట్రోలింగ్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాలో టాలెంటెడ్ యువ క్రికెటర్లకు కొదవ లేదు. కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి యువ స్టార్ బ్యాటర్ ఓ విక్‌నెస్‌తో ఇబ్బంది పడుతున్నాడు. కానీ, దానిపైనే పాఠాలు చెబుతూ ప్రస్తుతం నవ్వుల పాలవుతున్నాడు. మరి అయ్యర్‌పై ఎందుకు ట్రోలింగ్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది టీమిండియా. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేనకు పెద్దగా పోటీ ఎదురు కాకపోవచ్చు. సౌతాఫ్రికా ఒక్కటే కాస్త గట్టి టీమ్‌లా కనిపిస్తోంది. ఇక శ్రీలంక, నెదర్లాండ్స్‌పై కూడా టీమిండియా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం టీమిండియా అలాంటి ఫామ్‌లో ఉంది. జట్టులోని ఒకరిద్దరు ఆటగాళ్లు మినహా.. జట్టు మొత్తం భీకర ఫామ్‌లో ఉంది. వారిలో ఏ ఇద్దరు అద్భుతంగా రాణించినా.. విజయం టీమిండియాదే. అయితే.. ఫామ్‌లో లేని ఆ ఒకరిద్దరు ఆటగాళ్లలో ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకోవాలి.
వరల్డ్ కప్‌కి గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్నాడు అయ్యర్. అయితే.. గాయం కంటే ముందు అతనున్న ఫామ్ దృష్ట్యా మళ్లీ అతన్ని ఆసియా కప్‌తో జట్టులోకి తీసుకున్నారు. జట్టులోకి తిరిగొచ్చిన తర్వాత అయ్యర్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ, వరల్డ్ కప్‌లో మాత్రం అయ్యర్ ఆశించిన ఆస్థాయిలో రాణించడంలేదు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. అయితే.. జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో ఆదుకునే అవకాశాలు అయ్యర్‌కు చాలా వచ్చాయి. కానీ, ప్రతిసారి విఫలం అయ్యాడు. అయ్యర్ విఫలమైనా.. ఐదో స్థానంలో వచ్చే కేఎల్ రాహుల్ ఆదుకోవడంతో టీమిండియా విజయపథంలో దూసుకెళ్తోంది. ఎంతో కీలకమైన 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న అయ్యర్.. జట్టుకు అవసరమైనట్లు ఆడటం లేదు.
అయితే.. టాలెంట్ పరంగా అయ్యర్ అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ.. అతనికి షార్ట్ బాల్ విక్నెస్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి అయ్యర్ షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని ఓవర్‌కమ్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడంటే చాలు.. ప్రతి జట్టు కూడా షార్ట్ పిచ్ బంతులతో ఎటాక్ చేస్తోంది. అయ్యర్ ఆ బంతులకే వికెట్ సమర్పించుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అయ్యర్ షార్ట్ బాల్‌కు పుల్ షాట్ సరిగా ఆడలేక అవుట్ అయ్యాడు. ఇలా అయ్యర్ షార్ట్ బాల్స్‌కు పుల్ షాట్ ఆడలేక వికెట్ సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఓ యాడ్‌లో అయ్యర్ పుల్ షాట్ ఎలా ఆడాలో యువ క్రికెటర్లకు నేర్పిస్తున్నట్లు ఉంది. దీంతో యాడ్ తాజాగా విపరీతంగా వైరల్ అయింది. షార్ట్ బాల్స్‌కు అవుట్ అవుతున్న అయ్యర్ పుల్ షాట్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడు చూడండి అంటూ కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రకటనల్లో బాగానే ఆడుతున్నావ్.. మరి మ్యాచ్ సంగతేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.