iDreamPost
android-app
ios-app

అయ్యర్​కు అన్యాయం.. వద్దని మొత్తుకున్నా వినలేదు! దీనికి జై షాదే బాధ్యత!

  • Published Mar 15, 2024 | 6:13 PM Updated Updated Mar 15, 2024 | 6:13 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు అన్యాయం జరిగింది. అతడు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. దీనికి బోర్డు సెక్రటరీ జై షాదే బాధ్యత.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు అన్యాయం జరిగింది. అతడు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. దీనికి బోర్డు సెక్రటరీ జై షాదే బాధ్యత.

  • Published Mar 15, 2024 | 6:13 PMUpdated Mar 15, 2024 | 6:13 PM
అయ్యర్​కు అన్యాయం.. వద్దని మొత్తుకున్నా వినలేదు! దీనికి జై షాదే బాధ్యత!

కొన్ని నెలలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అన్ని జట్లను తోసిరాజని మళ్లీ ముంబైనే విన్నర్​గా నిలిచింది. రంజీ టైటిల్​ను ఎగరేసుకుపోవడం ఆ జట్టుకు ఇది 42వ సారి కావడం విశేషం. రంజీ ట్రోఫీని ఏ టీమ్​ కూడా ఇన్ని సార్లు నెగ్గలేదు. ఆ రకంగా ముంబై పేరు మీద ఎదురులేని రికార్డు నమోదైంది. ఆ టీమ్ ఛాంపియన్​గా నిలవడంలో కెప్టెన్ అజింక్యా రహానె, వెటరన్ పేసర్ ధవల్ కులకర్ణి, కొత్త కుర్రాడు ముషీర్ ఖాన్​తో పాటు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పాత్ర కూడా ఎంతగానో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో 95 పరుగుల సూపర్బ్ నాక్​తో టీమ్ విక్టరీలో కీలకంగా నిలిచాడు అయ్యర్. అలాంటోడికి అన్యాయం జరిగింది. అయితే దీనికి భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షాదే బాధ్యత అని అందరూ అంటున్నారు.

రీసెంట్​గా జరిగిన ఇంగ్లండ్​ టెస్టు సిరీస్​లోని మొదటి రెండు మ్యాచుల్లో అయ్యర్ సరిగ్గా ఆడకపోవడంతో అతడ్ని తొలగించారు సెలక్టర్లు. వెళ్లి రంజీల్లో ఆడమని అన్నారు. అయితే గత ఏడాది కాలంగా అతడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంజ్యురీకి ట్రీట్​మెంట్ తీసుకొని వన్డే వరల్డ్ కప్-2023లో ఆడాడు. మెగా టోర్నీ కోసం ఐపీఎల్​-2023ను కూడా వదులుకున్నాడీ స్టైలిష్ బ్యాటర్. ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, సౌతాఫ్రికా సిరీస్​లోనూ ఆడాడు. అలాగే ఇంగ్లండ్​తో సిరీస్​కూ అందుబాటులోకి వచ్చాడు. అయితే సిరీస్​లోని తొలి రెండు టెస్టుల్లో ఫెయిలవడంతో.. తర్వాతి 3 మ్యాచులకు అతడ్ని తప్పించారు. నేషనల్ డ్యూటీకి దూరంగా ఉన్నాడు కాబట్టి రంజీల్లో ఆడమని ఆదేశించింది బీసీసీఐ. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అది ఎక్కడ తిరగబెడుతుందోనని భయపడి అయ్యర్ ఆడలేదు.

Injustice to Iyer

రంజీల్లో ఆడమని చెప్పినా తమ ఆదేశాలను బేఖాతరు చేయడంతో అయ్యర్​కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి.. అది తిరగబెట్టే ప్రమాదం ఉండటంతోనే ఆడలేదని చెప్పినా బోర్డు సెక్రటరీ జై షా వినలేదు. ఏ క్రికెటర్ అయినా సరే దేశం తరఫున ఆడని టైమ్​లో డొమెస్టిక్ క్రికెట్​లో పాల్గొనాల్సిందేనని బీసీసీఐ న్యూ రూల్ తీసుకొచ్చింది. దానికి తోడు రంజీల్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్​ కూడా ఇవ్వకపోవడంతో వీళ్ల పోడు పడలేక వచ్చి ఆడాడు. విదర్భతో జరిగిన ఫైనల్​లో ముంబై తరఫున బరిలోకి దిగాడు అయ్యర్. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 7 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్​లో 95 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్ చేసే క్రమంలో మళ్లీ బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ మ్యాచ్​ ఆఖరి రోజు అతడు ఫీల్డింగ్​కు దిగలేదు. దీంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచుల్లో అతడు ఆడటం కష్టమని అంటున్నారు.

సో.. రంజీల్లో ఆడకుండా అయ్యర్ రెస్ట్ తీసుకోవడంలో, అతడి భయంలో న్యాయం ఉంది. కానీ బీసీసీఐ పెద్దలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా, దేశానికి అతడు అందించిన సేవల్ని మర్చిపోయి, కావాలనే గాయం సాకు చూపుతున్నాడంటూ సెంట్రల్ కాంట్రాక్ట్ తీసేశారు. పోనీ వాళ్లతో ఎందుకని రంజీల్లో ఆడితే మళ్లీ గాయం తిరగబెట్టింది. అటు సెంట్రల్ కాంట్రాక్ట్ పోయి, ఇటు గాయం కూడా తిరగబెట్టి, ఐపీఎల్ మ్యాచులూ మిస్సయ్యే ప్రమాదం.. ఇలా అన్ని విధాలుగా పాపం అయ్యర్​కు అన్యాయం జరిగింది. దీనికి బోర్డు, జై షాలదే బాధ్యత అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మళ్లీ అతడి కాంట్రాక్ట్​ను పునరుద్ధరించాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అతడికి ఇచ్చే గౌరవమని చెబుతున్నారు. మరి.. అయ్యర్​కు జరిగిన అన్యాయం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గంభీర్ ధీమా.. స్టార్క్ విషయంలో ఆ భయం లేదట! ఎందుకో తెలుసా?