iDreamPost

గంభీర్ ధీమా.. స్టార్క్ విషయంలో ఆ భయం లేదట! ఎందుకో తెలుసా?

రూ. 24.75 కోట్లు పెట్టి కొన్న మిచెల్ స్టార్క్ పై ఫుల్ ధీమాగా ఉన్నాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. స్టార్క్ విషయంలో ఆ భయలు లేవంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ. 24.75 కోట్లు పెట్టి కొన్న మిచెల్ స్టార్క్ పై ఫుల్ ధీమాగా ఉన్నాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. స్టార్క్ విషయంలో ఆ భయలు లేవంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గంభీర్ ధీమా.. స్టార్క్ విషయంలో ఆ భయం లేదట! ఎందుకో తెలుసా?

మిచెల్ స్టార్క్.. ఐపీఎల్ 2024 సీజన్ లో అందరి దృష్టి ఇతడిపైనే ఉంది. గతేడాది డిసెంబర్ లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో స్టార్క్ పై కాసుల వర్షం కురిసింది. 8 సంవత్సరాలు క్యాష్ రిచ్ లీగ్ కు దూరంగా ఉన్న ఇతడిని ఏకంగా రూ. 24.75 కోట్లు పెట్టి కొనుక్కుంది కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం. దీంతో ఈ మెగాటోర్నీ చరిత్రలోనే అత్యధిక ధరపలికిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు స్టార్క్. అయితే ఒక బౌలర్ పై ఇంత మెుత్తంలో పెట్టుబడి పెట్టడంపై అప్పట్లో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు లీగ్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్న వేళ మరోసారి ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో కేకేఆర్ మెంటర్, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ స్టార్క్ పై హాట్ కామెంట్స్ చేశాడు.

మిచెల్ స్టార్క్.. ఐపీఎల్ 2024లో అందరి ఫోకస్ ను తనపై ఉండేలా ఇప్పటికే చేసుకున్నాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. అయితే ఇంత ధరకు అతడు న్యాయం చేయగలడా? అన్నదే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. కానీ స్టార్క్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. ప్రముఖ స్పోర్ట్స్ మీడియా ఇన్ సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ..”మిచెల్ స్టార్క్ పై ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేశారు? అని చాలా మంది అడుగుతున్నారు. అయితే అతడిపై ఎంత మనీ పెట్టినా మాకేం భయం లేదు. అలాగే స్టార్క్ పై కూడా మేం ఎలాంటి ఒత్తిడి కూడా చేయదలచుకోలేదు. అతడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాం. ఇంతకు ముందు అంతర్జాతీయ క్రికెట్ లో ఎలాంటి ప్రదర్శన చేశాడో.. ఇక్కడా అలాగే రాణిస్తాడని భావిస్తున్నా” అంటూ ధీమా వ్యక్తం చేశాడు గంభీర్.

ఇదిలా ఉండగా.. మిచెల్ స్టార్క్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 27 మ్యాచ్ లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. చివరిగా కోల్ కత్తా నైట్ రైడర్స్ 2018లో అతడిని కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా అతడూ ఆ సీజన్ మెుత్తానికి దూరమైయ్యాడు. ఈసారి మాత్రం కేకేఆర్ స్టార్క్ పై భారీ ఆశలే పెట్టుకుంది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ తో పదునైన యార్కర్లు సంధించడంలో దిట్ట స్టార్క్. వేగానికి వేగం.. స్వింగ్ కి స్వింగ్ ఇలా అన్ని రకాల బంతులను వేస్తూ.. బ్యాటర్లకు చుక్కలు చూపించడంలో ఈ ఆసీస్ పేసర్ సిద్ధహస్తుడు. మరి ఇతడిపై గంభీర్ అలాంటి భయాలు లేవని ధీమా వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బుమ్రా-పాండ్యాను కాపాడింది రోహిత్ శర్మనే.. సంచలన నిజాలు బయటపెట్టిన పార్థివ్ పటేల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి