Nidhan
Pakistan: పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లో దారుణ ఆటతీరుతో ఇంటా బయట విమర్శల పాలవుతోందా టీమ్. ఈ తరుణంలో దాయాదికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Pakistan: పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లో దారుణ ఆటతీరుతో ఇంటా బయట విమర్శల పాలవుతోందా టీమ్. ఈ తరుణంలో దాయాదికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Nidhan
పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. బ్యాక్ టు బ్యాక్ వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లోనూ ఆ టీమ్ దారుణ ఆటతీరుతో నిరాశర్చింది. పసికూన కంటే హీనంగా ఆడుతూ ఇంటా బయట విమర్శలు మూటగట్టుకుంది. అసలు గ్రౌండ్లో ఆడేది పాక్ జట్టేనా అని స్వయంగా ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లే షాక్ అయ్యేంత చెత్తగా ఆడి పరువు తీసుకుంది. సొంత కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కూడా పాక్ టీమ్‌లో మూడ్నాలుగు గ్రూపులు ఉన్నాయి, ఫిట్నెస్ స్టాండర్డ్స్‌ను ఎవరూ పాటిండం లేదంటూ విమర్శలకు దిగడం వివాదాస్పదంగా మారింది. పాక్ క్రికెట్లో జరుగుతున్న ఒక్కో పరిణామం క్రికెటింగ్ దునియాలో ఆ దేశ ప్రతిష్టను దిగజారుస్తోంది. వచ్చే ఏడాది అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది.
తాము ఆతిథ్యం ఇచ్చే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంకో రెండేళ్ల తర్వాత జరిగే టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకొని పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది పాకిస్థాన్. అలాంటి తరుణంలో పాక్ క్రికెట్‌కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ స్టార్ ప్లేయర్.. తాజాగా టీ20 ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఇక మీదట చచ్చినా పాకిస్థాన్‌కు ఆడనని స్పష్టం చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందని, ఇన్నాళ్లూ ఆడినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నాడు మాలిక్. పాకిస్థాన్‌కు ఆడాలనే కోరిక, ఆసక్తి తనకు లేవన్నాడు.
‘ఇన్నేళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినందుకు నేను హ్యాపీ. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాలనే ఇంట్రెస్ట్ పోయింది. నేను ఆల్రెడీ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యా. ఇప్పుడు మిగిలిన టీ20 క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెబుతున్నా. ఇక మీదట నాకు అవకాశం దొరికిన ప్రతి లీగ్‌లోనూ అదరగొట్టేందుకు ప్రయత్నిస్తా’ అని మాలిక్ స్పష్టం చేశాడు. పాక్ టీ20 జట్టు ఎంపికకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని సెలెక్టర్లకు తెలిపాడు. లీగ్స్‌లో ఆడుతూ తన గేమ్‌ను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు సీనియర్ బ్యాటర్. ఇక, 2001లో అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ ఇచ్చిన మాలిక్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వచ్చాడు. అతడి రిటైర్మెంట్ వార్త ఇప్పుడు పాక్ క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది.
Shoaib Malik said – “I have no interest in playing for Pakistan again”. (CricWick). pic.twitter.com/y6HcCYB9g3
— Tanuj Singh (@ImTanujSingh) July 25, 2024