iDreamPost
android-app
ios-app

గబ్బా టెస్ట్ తర్వాత మమ్మల్ని హీనంగా చూశారు.. ఆసీస్ పదే పదే అవమానించింది: శార్దూల్

  • Published Aug 06, 2024 | 9:54 PM Updated Updated Aug 06, 2024 | 9:54 PM

Shardul Thakur: టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఆస్ట్రేలియా నిజస్వరూపాన్ని అతడు బయటపెట్టాడు.

Shardul Thakur: టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఆస్ట్రేలియా నిజస్వరూపాన్ని అతడు బయటపెట్టాడు.

  • Published Aug 06, 2024 | 9:54 PMUpdated Aug 06, 2024 | 9:54 PM
గబ్బా టెస్ట్ తర్వాత మమ్మల్ని హీనంగా చూశారు.. ఆసీస్ పదే పదే అవమానించింది: శార్దూల్

భారత జట్టు సాధించిన అద్భుత విజయాల్లో గబ్బా టెస్ట్ విక్టరీ ఒకటి. ఇది టీమిండియా హిస్టరీలోనే టాప్ విక్టరీస్​లో ఒకటిగా నిలిచిపోయింది. ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై అందునా గబ్బాలో ఓడించడం అంటే మామూలు విషయం కాదు. గబ్బాలో మ్యాచ్ డ్రా చేస్తే అదో రికార్డుగా చెప్పుకుంటారు. అలాంటిది కంగారూల పొగరును అదే గబ్బాలో అణచివేసింది టీమిండియా. ఈ అద్భుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2021లో చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ గైర్హాజరులో అజింక్యా రహానె కెప్టెన్సీలో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది భారత్. ఆ మ్యాచ్​లో రోహిత్ శర్మ కూడా ఆడాడు. అయితే కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

పంత్​, రోహిత్​తో పాటు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్​ కూడా పోరాడటం వల్లే గబ్బా టెస్టులో చారిత్రాత్మక విజయం సొంతమైంది. ఆ మ్యాచ్ జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నాడు శార్దూల్. ఆ మ్యాచ్​లో 69 పరుగులు చేసిన శార్దూల్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి టీమ్ సక్సెస్​లో కీలక పాత్ర పోషించాడు. తన బెస్ట్ ఇచ్చానని.. అందుకే ఆ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. అయితే భారత్ విజయం సాధించడంతో కంగారూలు షాక్​కు గురయ్యారని.. ఓటమి బాధను తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్​ను తమ మీద చూపించారని తెలిపాడు. ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ సహా మిగిలిన అందరు ప్లేయర్లను ఆస్ట్రేలియన్లు పురుగుల కంటే నీచంగా చూశారని.. ఆ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడని పేర్కొన్నాడు శార్దూల్.

‘గబ్బా టెస్ట్ తర్వాత మమ్మల్ని చాలా హీనంగా చూశారు. హోటల్ సిబ్బంది మాకు సహకరించలేదు. మా బెడ్​షీట్స్ కూడా మేమే మార్చుకున్నాం. క్వీన్స్​లాండ్ గవర్నర్ మమ్మల్ని అవమానించారు. ఒకవేళ భారత ఆటగాళ్లకు ఇష్టం లేకపోతే అక్కడికి రావొద్దని అన్నారు. తాము మ్యాచ్​ను నిర్వహించబోమని చెప్పారు. టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఇష్టం లేదని తెలిపారు. మా గురించి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ అన్నీ అబద్ధాలు చెప్పాడు. తద్వారా తాను తప్పించుకోవడమే గాక మాపై ప్రెజర్ పెంచాలని ప్రయత్నించాడు. అయితే అప్పటి కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ రహానె మాత్రం గివప్ ఇవ్వలేదు. ఆసీస్ బోర్డుతో ఫైట్ చేశారు. ఆ టూర్ చాలా కష్టంగా సాగింది. ఒకవైపు అవమానాలు, మరోవైపు ఇంజ్యురీలతో టీమ్ ఎంతగానో ఇబ్బంది పడింది’ అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. మరి.. గబ్బా టెస్ట్ అనగానే మీకు గుర్తొచ్చే విషయాలేంటో కామెంట్ చేయండి.