iDreamPost
android-app
ios-app

Prithvi Shaw: దుమ్మురేపుతున్న పృథ్వీ షా! ఇది కదయ్యా నీ అసలు రూపం..!

  • Published Aug 06, 2024 | 6:59 PM Updated Updated Aug 06, 2024 | 6:59 PM

Prithvi Shaw, One Day Cup 2024: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా.. తాజాగా తన స్థాయికి తగ్గట్లు ఆడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. అది ఎక్కడో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Prithvi Shaw, One Day Cup 2024: టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా.. తాజాగా తన స్థాయికి తగ్గట్లు ఆడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. అది ఎక్కడో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 06, 2024 | 6:59 PMUpdated Aug 06, 2024 | 6:59 PM
Prithvi Shaw: దుమ్మురేపుతున్న పృథ్వీ షా! ఇది కదయ్యా నీ అసలు రూపం..!

భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా గురించి క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్‌లో ఒక పెను సంచలనంలా దూసుకొచ్చి.. మరో సచిన్‌, మరో సెహ్వాగ్‌ అంటూ ప్రశంసలు పొందాడు. కానీ, ఎంత వేగంగా టీమిండియాలోకి వచ్చాడో.. అంతే వేగంగా వెళ్లిపోయాడు. 2018లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా.. కొంత కాలం తర్వాత కనుమరుగుయ్యాడు. కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లోనూ సరిగ్గా ఆడటం లేదు. దీంతో.. ఇక షా పని అయిపోయిందని.. మళ్లీ టీమిండియాలో రావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, పృథ్వీ షా మాత్రం తన పాత రోజులను గుర్తు చేస్తూ.. దుమ్మురేపుతున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న కౌంటీ క్రికెట్‌ వన్డే కప్‌లో ఆడుతున్న పృథ్వీ షా.. సూపర్‌ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. డెర్బీషైర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన పృథ్వీ షా.. తర్వాత హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 40 పరుగులు చేసి రాణించాడు. అక్కడి నుంచి షా బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. అలాగే డర్హంతో జరిగిన మ్యాచ్‌లో 71 బంతుల్లో 97 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. ఇక వోర్సెస్టర్‌షైర్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లోనే 72 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఇలా షా దండయాత్రం కొనసాగుతోంది.

నార్తాంప్టన్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్న పృథ్వీ షా ఇదే ఫామ్‌ను భారత దేశవాళి క్రికెట్‌లో కూడా కొనసాగించి.. వచ్చే ఐపీఎల్‌ 2025 సీజన్‌లో కూడా మంచి ప్రదర్శన చేసి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 5 టెస్టులు ఆడిన షా 339 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీలు చేశాడు. 6 వన్డేలు ఆడి 189 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒక టీ20 మ్యాచ్‌ ఆడి పరుగులేమి చేయలేదు. అతనికి ఉన్న టాలెంట్‌తో ప్రస్తుత టీమిండియాలో ఒక కీలక ప్లేయర్‌గా ఉండాల్సిందని క్రికెట్‌ అభిమానులు అంటూ ఉంటారు. మరి ఇప్పటికైనా టీమిండియాలోకి తిరిగి వచ్చి.. తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తాడో లేదో చూడాలి. మరి ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో పృథ్వీ షా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.